రావు బహదూర్‌ రాక ఆరోజే…!

Viswa
1 Min Read

Web Stories

Rao Bahadur Release: ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (2020) సినిమా తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు వెంకటేశ్‌ మహా కాంబినేషన్‌లో రూపొందిన తాజా సినిమా ‘రావు బహదూర్‌’. ఈ పీరియాడికల్‌ సైకాలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమాకు ‘అనుమానం పెనుభూతం’ అనేది ట్యాగ్‌లైన్‌. వికాస్‌ ముప్పాల, దీపాథామస్, బాల పరాసర్,ఆనంద్‌ భారతి, ప్రణయ్‌ వాక, మాస్టర్‌ కిరణ్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా ప్రమోషన్స్‌ ఇటీవల ఊపందుకున్నాయి.కానీ రిలీజ్‌ డేట్‌పై స్పష్టత రాలేదు. తాజాగా ఈ ‘రావు బహదూర్‌’ (Rao Bahadur cinema) సినిమాను ఈ ఏడాది జూన్‌ 5న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు (Rao Bahadur Release date) . మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ల జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు స్మరణ్‌ సాయి సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు జూన్‌ 4న యశ్‌ హీరోగా నటించిన ‘టాక్సిక్‌’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ నెక్ట్స్‌ రోజే, ‘రావు బహదూర్‌’ సినిమా రిలీజ్‌ అవుతుంది. మరి… సత్యదేవ్‌కు ఇది ఎంత వరకు కలిసి వస్తుందనేది చూడాలి. ఒకవేళ టాక్సిక్‌ సినిమా కనుక జూన్‌ 4న విడుదల కాకపోతే, మాత్రం సత్యదేవ్‌కు ఒక మంచి రిలీజ్‌ డేట్‌ దొరికినట్లే.

Please Share
Share This Article
84 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu