సినిమా: ది రాజాసాబ్ (Prabhas TheRajasaab Review)
నటీనటులు: ప్రభాస్, మాళవికా మోహనన్, రిద్దికుమార్, నిధీ అగర్వాల్, బొమన్ ఇరానీ, సత్య, సప్తగిరి, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను
దర్శకుడు: మారుతి
సంగీతం: ఎస్.తమన్
ఎడిటింగ్:
కెమెరా:
నిర్మాణం: టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్, ఇషాన్ సక్సేనా
నిడివి: 3 గంటల 3 నిమిషాలు
విడుదల తేదీ: జనవరి 9
రేటింగ్:2/5
కథ
దేవనగరి సంస్థానాదీశురాలు గంగాదేవి (జరీనా వాహబ్). గంగాదేవి భర్త కనకరాజు (సంజయ్‌దత్) స్వార్థపరుడు. ధనం అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే తాను చనిపోయిన తర్వాత కూడా తన ఆస్తిని తానే అనుభించాలనుకునే మనస్తత్త్వం కలవాడు. పైగా క్షుద్రమాంత్రికుడు. హిప్నటైజర్. (TheRajaSaab ReviewIntelugu)
గంగా దేవి, కనకరాజుల మనవడు రాజా ఆలియాస్ రాజా సాబ్(ప్రభాస్). కనకరాజు తాను చనిపోయిన తర్వాత, పునర్జన్మెత్తి తన సంపాదనను తానే అనుభించాలను కుం టాడు. అయితే ఇందుకోసం తన భార్య గంగాదేవి, మనవడు రాజాసాబ్‌లను చంపాలని ప్లాన్ చేస్తాడు. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? కనక రాజు బారి నుంచి గంగా దేవి, రాజా సాబ్ ఎలా బయటపడ్డారు? అసలు..దేవనగరి సంస్థానాధీశురాలు అయిన గంగాదేవి ఓ క్షుద్రమాంత్రికుడిని ఎలా వివాహం చేసుకుంది? అన్నది మిగిలిన కథ (TheRajaSaab Review).
విశ్లేషణ
హారర్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌కి హిప్నటైజ్ అనే కాన్సెప్ట్‌ను జోడించి, దర్శకుడు మారుతి ‘ది రాజాసాబ్’ కథను చెప్పాలనుకున్నాడు. కానీ ఇందులో మారుతి సఫలం కాలేకపోయారు. హారర్, ప్యాంటసీ, హిప్నటైజ్‌అంశాలను ఆడియన్స్‌కు నచ్చే రితీలో బ్లెండ్ చేయలేకపోయాడు. కథ, కథనంలో చాలా లోటుపాట్లు ఉన్నా యి. ఫోర్డ్స్ ఎమోషన్స్, ఫోర్డ్స్ హ్యూమర్ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయి.
పవర్‌ఫుల్ క్షుద్రమాంత్రికుడు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి హిప్నటైజ్ మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటో ఈ సినిమాలో కన్వెన్సింగ్‌గా చెప్పలేదు. కోటి రూపాయల సూట్ కేసు కోసం ప్రభాస్ చేసే జంప్‌ఆలోచన దర్శకుడుకి ఎలా వచ్చిందో. ఏంటో! ఫస్టాప్ అంతా ఫ్లాట్‌గా, ఊహాత్మక సన్నివేశాలతో సాగు తుంది. ప్రీ ఇంట్రవెల్ బాగానే ఉన్నా, సెకండాఫ్ స్టార్ట్ కాగానే మళ్లీ అదే రోటీన్ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ లవ్‌ట్రాక్ సీన్స్ అయితే ఏం బాగోలేవు. ప్రీ క్లైమాక్స్ సెటప్ బాగానే ఉన్నా, ఇది అర్థం చేసు కోవడానికి ఆడియన్స్ బుర్ర పిచ్చెక్కిపోద్ది. మనం ఎంత బాగా రాసుకున్నది కాదు..ఆడియన్స్‌కు ఎంత అర్ధమయ్యేలా చెప్పాం అన్నది ముఖ్యం కదా. ట్రైలర్‌లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్‌ని తీసేశారు. రెబల్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే అంశం ఇది. వింటేజ్ ప్రభాస్ కనిపించడం, క్లైమాక్స్ సెటప్, ప్రభాస్ లుక్స్ సినిమాలో ప్రధానంగా బాగున్న అంశాలు ఇవే.
నటీనటులు – సాంకేతిక విభాగం
రాజాసాబ్ గా ప్రభాస్ (TheRajaSaab Prabhas) నటన బాగుంది. క్లైమాక్స్, హాస్పిటల్ సీన్స్‌లో మంచి నటన కనబరిచాడు. రీసెంట్ టైమ్స్ ప్రభాస్ ఇంత ఎమోషనల్ యాక్టింగ్ ఇదే. పేకమేడల కనకరాజుగా సంజయ్‌దత్ యాక్టింగ్ బాగుంది. ఈ సినిమాకు బ్యాక్‌బోన్‌లాంటి రోల్ ఇది. ఉన్నంతలో సంజయదత్ మెప్పించాడు. ఈ సినిమాకు మరో మెయిన్ పిల్లర్ అయిన గంగాదేవి పాత్రలో జరీనా వాహబ్ మంచి నటన చూపించారు. అల్జీమర్స్ ఉన్న మహిళగా, పవర్‌ఫుల్ గంగాదేవి(సెకండాఫ్‌లో)గా క్యారెక్టర్‌లో వేరియేషన్స్ చూపించారు (TheRajasaab cast and crew)
ఇక స్టెల్లా బెస్సీగా నిధీ అగర్వాల్, భైరవిగా మాళవికా మోహన్, అనితగా రిద్దికుమార్‌లు యాక్ట్ చేశారు (TheRajaSaab Heroines). రిద్ది కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. నిధీ, మాళవికల పాత్రలకు కథలో కోర్ పాయింట్ కనెక్ట్‌విటీలో సరైన ఇంపార్టెన్స్ లేదు. లవ్‌ట్రాక్, సాంగ్స్ కోసమే పెట్టినట్లుగా ఉంది. పద్మభూషన్‌గా బొమన్ ఇరానీ తన వంతు యాక్టింగ్ చేశారు. కానిస్టేబుల్ మంగళంగా వీటీవీ గణేష్, శ్రీనుగా ప్రభాస్ శ్రీను, రిప్‌గా సప్తగిరిల కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గంగరాజుగా సముద్రఖని పాత్ర స్క్రీన్‌పై కాస్త సీరియస్‌గా కనిపించిన, ఈ రోల్‌ను సడన్‌గా స్టాప్ చేశారు. కరిముల్లాగా వైవా హర్ష, మహేశ్‌గా రంగస్థలం మహేశ్ స్క్రీన్‌పై కనిపించారు.(Rajasaab FDFS)
తమన్ సంగీతం ఈ సినిమాకు ఫ్లస్ కాలేకపోయింది. సాంగ్స్ విజువల్‌గా బాగున్నాయి కానీ, సౌండ్‌తో అంత ఇంపాక్ట్‌గా లేవు. క్లైమాక్స్ ఆర్‌ఆర్ బాగుంది. ఎడిటింగ్ చాలా చేయవచ్చు. కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా: హిప్నటైజ్ అనే సైకలాజికల్ సైంటిఫిక్ అంశాని క్షుద్రం నేపథ్యంతో చెప్పి, ఆడియన్స్‌ను మారుతి చెప్పించలేకపోయాడు. కథ విషయంలో మారుతి సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని ఉంటే బాగుండేది. అప్పుడు థియేటర్స్‌లో ఆడియన్స్‌ల భావోద్వేగాలు బాగుండేవి. వారి బుర్రలు పిచ్చెకిపోయేవి కావు. కానీ ప్రభాస్ కోసం ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు. ఓవరాల్‌గా మాత్రం ‘ది రాజాసాబ్’ సినిమాను ఆడియన్స్‌ను పూర్తిస్థాయిలో శాటిస్‌ఫై చేయకపోవచ్చు.