మారుతి మాటని ప్రభాస్‌ సీరియస్ గా తీసుకుంటే బాగుండేదేమో…

Viswa
2 Min Read

Web Stories

TheRajasaab Result: ‘ది రాజాసాబ్‌’ (TheRajasaab) సినిమా ఫ్లాప్‌ కావడంతో, అందరూ ఈ సినిమాకు మారుతి (TheRajasaab Movie Director) అందించిన కథ, స్క్రీన్‌ప్లేనే కారణం అంటూ మాట్లాడుతున్నారు. కానీ ఓ దశలో ‘ది రాజాసాబ్‌’ సినిమాను మారుతియే వద్దనుకు న్నారు. గోపీచంద్‌తో మారుతి పక్కా కమర్షియల్‌ అనే సినిమా తీసి, ఫ్లాప్‌ను మూటగట్టుకున్నారు. దీంతో ప్రభాస్‌తో సినిమాను మారుతియే వద్దనుకుని, ఈ విషయాన్ని ప్రభాస్‌తో చర్చించారు. ‘ది రాజాసాబ్‌’ సినిమా వద్దని, ప్రభాస్‌తో చెప్పారు మారుతి. కానీ ప్రభాస్‌యే కన్వెన్స్‌ చేసి, ఈ సినిమాను ముందుకు తీసుకుని వెళ్లేలా చేశారు. బాధలో ఉన్న మారుతిని, ఓదార్చడానికి ప్రభాస్‌ అలా చెప్పి ఉండొచ్చెమో.

ప్రభాస్‌ తన మంచితనంతో కాకుండ, సినిమాటిక్‌ కమర్షియల్‌ వేలో ఆలోచించి, ‘ది రాజాసాబ్‌’ సినిమాను వద్దనుకున్నట్లయితే ఇప్పుడు, ప్రభాస్‌ ఖాతాలో ఓ ఫ్లాప్‌ మూవీ ఉండేది కాదు. కానీ విధిని ఎవరూ తప్పిం చలేరు. ఇంకా చెప్పాలంటే…ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌ తెలుగురాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్‌ చేశారు. లాభాలు రాలేదు.

ఆ తర్వాత ‘ది రాజాసాబ్‌’ సినిమాను ప్రభాస్‌తో మారుతి తీయాలనుకున్నప్పుడు, ఈ సినిమాకు నిర్మాతగా తొలుత డీవీవీ దానయ్యను అనుకున్నారు. ఆయన కూడా సరే అన్నారు. కాకపోతే…‘ది రాజాసాబ్‌’ సినిమా షెడ్యూల్, ప్రభాస్‌ కాల్షీట్స్, ఎప్పటికల్లా పూర్తి కావొచ్చనే ఓ అంచనా వంటి వివరాలను గురించి మారుతి, ప్రభాస్‌ టీమ్‌ను ఓ క్లారిటీ అడిగారు. ఈ అంశంలో క్లారిటీ రాలేదు. దీంతో ఈ సినిమాను పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ టేకప్‌ చేయాల్సి వచ్చింది. ‘ఆదిపురుష్‌’తో వచ్చిన నష్టాలను ‘ది రాజాసాబ్‌’ సినిమా పూడుస్తుందని విశ్వప్రసాద్‌ భావించి ఉండొచ్చు. కానీ ఈ సినిమా ఇంకా పెద్ద నష్టాలను తెచ్చిపెట్టింది. అయినా కాంబి నేషన్స్, హీరో స్టారడమ్‌పై ఆధారపడి కలెక్షన్స్‌ వచ్చే రోజులు పోయాయని, కంటెంట్‌నే కింగ్‌ అని ఇంకా కొంతమంది నిర్మాతలు నమ్మకపోవడం ఆలోచించదగ్గ విషయం.

‘ది రాజాసాబ్‌’ కథను కూడా పలుమార్లు మార్చారు. ది రాజాసాబ్‌ కథను కూడా చాలా సార్లు మార్చినట్లుగా స్పష్టం అవుతుంది. తొలుత ఈ సినిమాను హారర్‌ కామెడీ జానర్‌లో తీయాలనుకున్నారు. ఆ తర్వాత హారర్‌ ప్యాంటసీ జానర్‌లోకి వెళ్లింది. ఇది ఇక్కడితో ఆగకుండ హిప్నాటిజం అనే కాన్సెప్ట్‌ను కూడ జోడించారు. దీంతో ముందుగా అనుకున్న మెయిన్‌ కథ పక్కకు పోయినట్లుగా తెలుస్తోంది. ది రాజాసాబ్‌ సినిమాకు ముందుగా అనుకున్న కథ వేరు అని, హిప్నాటిజం కాన్సెప్ట్‌ తర్వాత కథలో మార్పులు చేశామని ప్రభాస్‌యే స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

ప్రభాస్‌ ది రాజాసాబ్‌ రివ్యూ

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu