TheRajasaab Movie: సినిమా ప్రపంచంలో ‘ఫస్ట్ ఇంప్రెషన్’ అనేది చాలా కీలకం. మొదటి రోజే పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది, లేదంటే ఆ నష్టాన్ని భర్తీ చేయడం ఎవరికైనా కష్టమే. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రం విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. జనవరి 9న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు మారుతి (TheRajasaab Movie Director Maruthi) విడుదల చేసిన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఆకాశమంత అంచనాలను పెంచాయి.
కానీ, థియేటర్లలో ప్రేక్షకులకు ఒక రకమైన అసంతృప్తి ఎదురైంది. టీజర్‌లో ‘రాజాసాబ్ వరల్డ్’ అంటూ ప్రభాస్‌ను తలకిందులుగా కుర్చీలో కూర్చున్న పవర్‌ఫుల్ లుక్‌లో చూపించారు. అలాగే ఓల్డ్ ఏజ్ గెటప్‌లో ఉన్న ప్రభాస్ సీన్లు హైలైట్ అవుతాయని అంతా భావించారు. తీరా థియేటర్‌లో చూస్తే, ప్రచార చిత్రాల్లో కనిపించిన ఆ కీలక సన్నివేశాలు సినిమాలో లేకపోవడంతో సగటు అభిమాని నిరాశకు గురయ్యాడు. సెకండాఫ్ మొత్తం ఆ లుక్‌లోనే ప్రభాస్ ఉంటాడని ఆశించిన వారికి మారుతి షాక్ ఇచ్చాడు.
అయితే సినిమా ఫలితంపై ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను గమనించిన చిత్ర యూనిట్, వెంటనే మేల్కొంది. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. టీజర్, ట్రైలర్‌లో చూపించిన ఆ ఓల్డ్ ఏజ్ ప్రభాస్ సీన్లను తిరిగి సినిమాలో కలపాలని నిర్ణయించారు. మూడు రోజుల తర్వాత ప్రారంభం కాబోయే సంక్రాంతి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ అదనపు 8 నిమిషాల ఫుటేజీని థియేటర్ల ప్రింట్లకు జత చేయబోతున్నారు.దాదాపు ఎనిమిది నిమిషాల ఫుటేజ్‌ని యాడ్ చేస్తున్నారు. అలాగే సోమవారం నుంచి సాధారణ టికెట్ ధరలతోనే, ఈ సినిమాను ఆడియన్స్ థియేటర్స్‌లో చూడొచ్చని దర్శకుడు మారుతి చెబుతున్నారు.రిలీజ్ సమయంలో సర్వర్ సహకరించకపోవడం వల్ల, ప్రభాస్ ఓల్డ్ గెటప్‌లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌ను యాడ్ చేయలేకపోయామని, ఇప్పుడు యాడ్ చేస్తున్నామని ఈ చిత్రం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.
సాధారణంగా సినిమా విడుదలయ్యాక చేసే ఎడిటింగ్ మార్పులు ఫలితాన్ని పెద్దగా మార్చలేవు. అయితే, ప్రభాస్ వింటేజ్, హారర్ లుక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది కొంత ఊరటనిచ్చే విషయమే. ఈ కొత్త సీన్ల వల్ల సంక్రాంతి సెలవుల్లో రిపీట్ ఆడియన్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే, కేవలం 5 నిమిషాల కోసం ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారా? లేదా అనేది వేచి చూడాలి. మొత్తం మీద ‘ది రాజాసాబ్’ టీమ్ పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరి ఈ 5 నిమిషాల సీన్స్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మార్పు తెస్తుందో చూడాలి.
వేరే ప్రపంచంలో యుద్ధం చేయాలి రాజాసాబ్