‘రాజాసాబ్’ సాంగ్ కాపీనా? తమన్ కి కౌంటర్‌ ఇచ్చిన ఫారిన్ కంపోజర్..!

Kumar NA
2 Min Read

Web Stories

Rajasaab Movie Songs: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా విడుదలైన ‘ది రాజాసాబ్’ (TheRajassab)  సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల (TheRajasaab Collections) పరంగా దూసుకుపోతున్నప్పటికీ, వివాదాలు మాత్రం ఈ చిత్రాన్ని వదలడం లేదు. ముఖ్యంగా ఈ చిత్రంలోని మ్యూజిక్, మేకింగ్‌పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు మారుతి టేకింగ్ ఆశించిన స్థాయిలో లేదని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ నటన, కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నప్పటికీ, కథనం నెమ్మదిగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ పాట కాపీ వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమాలో ప్రభాస్ ముగ్గురు కథానాయికలతో కలిసి స్టెప్పులేసిన ‘నాచే నాచే’ ర్యాప్ సాంగ్ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. స్వీడన్‌కు చెందిన ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసర్, డీజే విడోజీన్ ఈ పాటపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘నాచే నాచే’ సాంగ్ ట్యూన్, తను 2024లో కంపోజ్ చేసిన ఒక మ్యూజిక్ ట్రాక్ నుంచి కాపీ కొట్టారని ఆయన ఆరోపించారు. తన పాటను, రాజాసాబ్‌లోని పాటను పోలుస్తూ విడోజీన్ ఒక వీడియోను షేర్ చేశారు. (TheRajasaab Songs)

అందులో ఈ రెండు ట్యూన్లు ఒకేలా ఉన్నాయని చూపిస్తూ.. ఆగ్రహంతో రెస్పాండ్‌ కావడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. “ఇది కాపీ కాదా?” అని ఆయన నెటిజన్లను నేరుగా ప్రశ్నించారు.ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతున్నారు. బాణీలు సమకూర్చడంలో తమన్ విదేశీ ట్యూన్లను యథాతథంగా వాడేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. (TheRajasaabMusic)

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తన ట్యూన్ కాపీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేసిన డీజే విడోజీన్, ప్రభాస్ గురించి మాత్రం పాజిటివ్‌గా స్పందించారు. “ఇందులో ప్రభాస్ తప్పు ఏమీ లేదు, ఆయన చాలా గొప్ప నటుడు” అని విడోజీన్ పేర్కొనడం విశేషం. వాస్తవానికి ఈ పాట బాలీవుడ్ క్లాసిక్ ‘డిస్కో డ్యాన్సర్’లోని పాటకు రీమిక్స్ వెర్షన్. అయితే ఒరిజినల్ ట్యూన్‌కు బదులు విదేశీ డీజే మ్యూజిక్ వాడారనే ఆరోపణ ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఈ కాపీ ఆరోపణలపై చిత్ర యూనిట్ లేదా సంగీత దర్శకుడు తమన్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కేవలం ట్యూన్ పోలికలు మాత్రమేనా లేక నిజంగానే కాపీ చేశారా అన్నది మేకర్స్ వివరణ ఇస్తే తప్ప స్పష్టత రాదు.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu