ఒడిశాలో మహేశ్‌బాబు…నెక్ట్స్‌ ఎక్కడికో తెలుసా?

Maheshbabu SSMB29: హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లోని మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది.

Viswa
1 Min Read
MaheshBabu Movie Filming in Odisha

Web Stories

Maheshbabu SSMB29: హీరో మహేశ్‌బాబు (MaheshBabu), దర్శకుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లోని భారీ బడ్జెట్‌ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరు గుతోంది. ఇటీవల హైదరాబాద్‌లోని ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా కాంబినేషన్‌లోని సీన్స్‌పై చిత్రీకరణ జరిపారు. ఈ షెడ్యూల్‌ పూర్తి కావడంతో, నెక్ట్స్‌ షెడ్యూల్‌ను ఒడిశాలో ప్రారంభించారు. మార్చి6 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్, ఈ షెడ్యూల్‌లో పాల్గొంటుంన్నాడు. మహేశ్‌బాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్, ప్రియాంకా చోప్రా కాంబినేషన్‌లోని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఏ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తారు?

గత ఏడాది డిసెంబరు రాజమౌళి, అతని టెక్నికల్‌ టీమ్‌ ఒడిశా వెళ్లి, కొరాపుట్‌ జిల్లాలోని చాలా లొకే షన్స్‌ను పరిశీలించారు. దేవ్‌ మాలి, తోలో మాలి, కోలాబ్, పుట్‌ సీల్‌ ఏరియాలను లొకేషన్స్‌గా సెలెక్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లొకేషన్స్‌లోనే ఈ సినిమా చిత్రీకరణ జరగుతుంది. దాదాపు ఇరవై రోజుల పాటు ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో కూడా షూటింగ్‌ ప్లాన్‌ చేశారు.

రిలీజ్‌ ఎప్పుడు?

అలాగే 2024 అక్టోబరులో కెన్యాలో లొకేషన్స్‌ను పరిశీలించి వచ్చారు రాజమౌళి. ఒడిశా షెడ్యూల్‌ తర్వాత కెన్యాలోనే ఈ సినిమా చిత్రీకరణ జరిగే చాన్సెస్‌ ఉన్నాయని తెలిసింది. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ అడ్వెం చరస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌కి విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. కీరవాణి స్వరకర్త. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని, 2027లో తొలిభాగం విడుదల అవుతుందని తెలిసింది.

రీసెంట్‌ టైమ్స్‌లో ఒడిశాలో తెలుగు సినిమాల చిత్రీకరణలు బాగా జరుగుతున్నాయి. అనుష్కాశెట్టి ‘ఘాటి’ సినిమా మేజర్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఇక్కడే జరిగింది. వెంకటేష్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ చిన్నపాటి షెడ్యూల్‌ చిత్రీకరణ కూడా ఒడిశాలోనే జరిగింది.

 

 

Please Share
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu