నడుపుకో నన్ను జగమంతా నీ జంట…!

SPM
SPM
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
1 Min Read
Vijay Deverakonda’s Pan-India Film Ranabaali Releases Full Lyrical Song “Endhayya Saami”

Web Stories

Endhayya Saami Lyrical Song: ‘గీతగోవిందం’, ‘డియర్‌కామ్రేడ్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ (VijayDevarakonda) , హీరో రష్మికా మందన్నాల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘రణబాలి’. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాకు రాహుల్‌ సంకృత్యాయన్‌ దర్శ కత్వం వహి స్తున్నారు. 19వ శతాబ్ధం నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా కథనం సాగుతుంది. టీ సిరీస్, భూషణ్‌కుమార్‌ సమర్పణలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 16(Ranabaali Movie Release date) న రిలీజ్‌ కానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఏదయ్యా సామీ (Endhayya Saami Lyrical song) పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. సంగీత దర్శక ద్వయం అజయ్‌–అతుల్‌ స్వరకల్పనలో రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను శ్వేతా మోహన్, అజయ్‌ గోగవలే పాడారు. ‘‘ఏందయ్య సామీ ఇట్ట గాస్తాందీ వెన్నెల…’ అంటూ సాగే ఈ పాట లిరిక్స్‌ ‘అమ్మవో..ఆలివో..నువ్వు ఎవరో గానీ…జన్మనే ఏలవే రణబాలుని రాణి…’, ‘చిగురు పాదాల సిరిమువ్వవై ఉంటా, నడుపుకో నన్ను జగమంతా నీ జంట…’, అంటూ ఈ పాట లిరిక్స్‌ సాగుతాయి. మరోవైపు ‘రణబాలి’ సినిమాతో పాటుగా, ‘రౌడీ జానర్థన’ అనే పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమా చేస్తున్నారు విజయ్‌దేవరకొండ. ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ మంగులూరులో ప్రారంభమైందని తెలిసింది. రవికిరణ్‌ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Please Share
Share This Article
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu