కష్టం వచ్చిన ప్రతిసారి ఆ దేవుడే దిగిరావాలా?

Viswa
2 Min Read

Web Stories

Satyadev Samavarthi Teaser: సత్యదేవ్‌ (Satyadev) హీరోగా ‘ఆరంభం’ ఫేమ్‌ అజయ్‌ నాగ్‌.వి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సమవర్తి’ ( Samavarthi ). గానవి లక్ష్మణ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న  ఈ సినిమాలో, శ్రీకాంత్‌ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శివచరణ్‌రెడ్డి జక్కిడి, శశిధర్‌రెడ్డి పడమటి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం,మలయాళం, కన్నడం భాషల్లో త్వరలోనే రిలీజ్‌ ( Samavarthi release) కానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో మహదేవ్‌ పాత్రలో సత్యదేవ్‌ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మనుషుల్ని చంపి తినే ఓ మ్యాన్‌ఇటర్‌ పులిని చంపే వ్యక్తిగా సత్యదేవ్‌ ఈ సినిమాలో కనిపిస్తారని, ఈ సినిమా టీజర్‌ స్పష్టం చేస్తోంది.

డార్క్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ కల్ట్‌

Samavarthi Teaser Launched event
Samavarthi Teaser Launched event

ఏదైనా గోల్‌మాల్‌ చేయబోతున్నారా..!

ఇక ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సత్యదేవ్‌ మాట్లాడుతూ ఇండస్ట్రీతో తనతో సినిమా చేయమని తాను ఎప్పుడూ కూడా ఏ దర్శకుడిని అడగలేదని, ఒక్క అజయ్‌ని మాత్రమే అడిగానని, సమవర్తి సినిమా అద్భుత విజయం సాధిస్తుందని అన్నారు. దక్షిణభారతదేశంలోని అన్ని అడవుల్లో ఈ సమవర్తి సినిమా షూ టింగ్‌ చేశామని కూడా సత్యదేవ్‌ తెలిపారు. ‘ఆరంభం’ సినిమాను సరైన రితీలో ప్రమోట్‌ చేసుకోవడంలో
తాము విఫలమైయ్యామని, ఆ తర్వాత మరో సినిమా చేసే అవకావం వస్తుందా? అని అనుకుంటున్న తరు ణంలో సత్యదేవ్‌ పిలిచి మరీ అవకాశం కల్పించారని అజయ్‌ తెలిపారు. ఈ సినిమాలో తానొక స్పెషల్‌ క్యారెక్టర్‌ చేశానని, సత్యదేవ్‌ వన్‌ మ్యాన్‌ షోలా ‘సమవర్తి’ సినిమా ఆడియన్స్‌ను అలరిస్తుందని శ్రీకాంత్‌ చెప్పారు. సత్యదేవ్‌ కెరీర్‌లో ఇదొక పెద్ద సూపర్‌హిట్‌ సినిమా అవుతుందని, థియేటర్స్‌లో మ్యాజిక్‌ చెస్తుందని నిర్మాతలు చెప్పారు.

ఇక ఈ సమవర్తి టీజర్‌లో ఈ కింది డైలాగ్స్‌ ఉన్నాయి….

కష్టం వచ్చిన ప్రతిసారి ఆ దేవుడే దిగిరావాలా?

ట్రిగర్‌ నేను నొక్కాలి..బుల్లెట్‌ దాని నోట్లో దిగాలి.అది నేను చూడాలి.

ఈ సారి మాత్రం మిస్‌ అవ్వదు…!

ఈ డైలాగ్స్‌ సమవర్తి సినిమా టీజర్‌లో ఉన్నాయి.

రణబాలి రెడీ..ఏందయ్య సామి పాట కూడా…!

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu