మరో సినిమా కథ..ఈ సారైనా హిట్‌ అవుతుందా?

Viswa
1 Min Read

Web Stories

ENE Repeat Movie: టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)కు కాస్త బ్యాడ్‌టైమ్‌ నడుస్తున్నటుంది. వరుసగా విశ్వక్‌ సినిమాలు బాక్సా ఫీస్‌ వద్ద బోల్తా కొడుతున్నాయి. విశ్వక్‌ గత చిత్రం ‘కల్ట్‌’, అంతకుముందు తీసిన ‘ఫంకీ’ సినిమాలు ప్లాఫ్‌ గానే నిలిచాయి. ఇప్పుడు విశ్వక్‌ నుంచి మరో సినిమా రాబోతోంది. అదే ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్‌.

తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఈ నగరానికి ఏమైంది? 2’ సినిమా (ENE Repeat Movie) తెరకెక్కింది. విశ్వక్‌సేన్, శ్రీనాథ్‌మాంగటి,అభినవ్‌ గోముఠం, వెంకటేష్‌ కాకుమాను ఈ సిని మాలోని మెయిన్‌ లీడ్‌ రోల్స్‌ చేశారు. సృజన్‌ ఎర్రబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఓ ఫిల్మ్‌మేకింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా కథనం సాగుతుందని ఈ సినిమా ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. అదే సర్వైవల్‌ బ్యాక్‌డ్రాప్‌ అన్నది మరో లేయర్‌గా అనిపిస్తోంది.

అయితే ‘ఫంకీ’ సినిమా కథలో హీరో దర్శకుడు కావాలనుకుంటున్న బ్యాక్‌డ్రాపే ఉంటుంది. ఇప్పుడు ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ స్టోరీ కూడా దాదాపు అదే. సో…‘ఈఎన్‌ఈ రిపీట్‌’ కథను ‘ఫంకీ’ సినిమాకు డిఫరెంట్‌గా తరుణ్‌భాస్కర్‌ (Tharun Bhascker Dhaassyam) ఎంతవరకు తెరపై చూపించగలిగారు? అన్నది ఈ నెల 19న తెలుస్తుంది.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah