‘పురుషః’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు పవన్ కల్యాణ్ బత్తుల. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, వీటీవీ గణేష్, ‘వెన్నెల’ కిషోర్‌లు కీలక పాత్రల్లో నటించారు. బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ ‘పురుషః‘ సినిమా ఈ నెల 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం నిర్మాత బత్తుల కోటేశ్వరరావు ఈ సినిమాను గురించిన కొన్ని విశేషాలను పంచుకున్నారు.
బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ-”గుంటూరు జిల్లాలోని కారంపూడి మా స్వస్థలం. సినిమా ఫీల్డ్‌లో నాకు సబంధం లేదు. కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేస్తాను. ‘గోకులంలో సీత’ సినిమా చూసి పవన్‌కల్యాణ్‌గారు గొప్ప స్థాయికి వెళ్తారని నాకు అనిపించింది. ఆ వయసులో నన్ను నేను ఆయనలో చూసుకుని, పవన్‌గారికి అభిమానిగా మారిపోయాను. అలాగే నాకు కొడుకు జన్మిస్తే, ఆయన పేరే పెట్టుకోవాలని అనుకున్నాను. పవన్‌కల్యాణ్‌గారి ‘తమ్ముడు’ సినిమా సమయంలో మాకు అబ్బాయి పుట్టాడు. దీంతో మా బాబుకు పవన్‌కల్యాణ్ అని పేరు పెట్టాము.

– మా అబ్బాయి బత్తుల పవన్‌కల్యాణ్‌కు కాస్త సిగ్గు, బిడియం ఎక్కువ. అలాగే నా కొడుకును హీరోగా వెండితెరపై చూడాలన్నది నా ఆకాంక్ష. దీంతో మా అబ్బాయిని హీరోగా చేశాను. మా అబ్బాయి బిడియం, సిగ్గు కూడా పోయాయి. ఇక మా అబ్బాయిని హీరోగా పెట్టి, నాకున్న స్తోమతతో మూడు సినిమాలు తీస్తానని చెప్పాను. అన్నట్లుగానే మూడు చిత్రాలు తీస్తాను. మా అబ్బాయి పవన్ హీరోగా నిలబడితే ఒకే. లేకపోతే మళ్లీ తిరిగి వచ్చి, వ్యవసాయం చేసుకోవాలని ముందే చెప్పాను. అలాగే ‘పురుషః’ చిత్రంతో భారీ లాభాలు ఆశించడం లేదు.
వీరు వులవలగారి కంటే, ముందు ఓ దర్శకుడితో, మా బ్యానర్‌లో సినిమా చేయాలి. కానీ కుదర్లేదు. ఆ తర్వాత సతీష్ ముత్యాలగారు వీరిగారిని పరిచయం చేయగా, వీరుగారు ‘పురుషః’ కథ చెప్పారు. ఈ సినిమా కథ నచ్చి, మా కన్‌స్ట్రక్షన్ ఆఫీస్‌నే సినిమా ఆఫీస్‌గా మార్చేసి సినిమా తీశాం. ‘పురుషః’ కథ ప్రేక్షకులందర్నీ నవ్విస్తుంది. కథలో ‘వెన్నెల’ కిషోర్‌గారి వల్లే సంఘర్షణ వస్తుంది. వీటీవీ గణేష్‌గారి పాత్ర ఆడియన్స్‌ను నవ్విస్తుంది. అనంతశ్రీరామ్‌గారు ఓ స్పెషల్ రోల్ చేశారు. మా కోసం కీరవాణిగారు పాట పాడటం మా లక్. శ్రవణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘పురుష:’ చిత్రాన్ని మొత్తంగా మూడు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మే 21 నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నాం. థియేటర్లో హాయిగా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మా చిత్రం ఉంటుంది.
Уже давно хотел найти этот вопрос, и тут обнаружил
в этом разборе важный разбор!
References:
Microgaming casino list https://jayaynhm928115.blogsvila.com/41892879/casino-of-gold-dein-ultimativer-guide
Way cool! Some extremely valid points! I appreciate you penning
this write-up and the rest of the website is very good.
If some one wants expert view on the topic of running
a blog then i suggest him/her to pay a visit this webpage, Keep up the
pleasant work.