పురుషః సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది : హీరో బత్తుల పవన్‌కళ్యాణ్‌

PR
PR
2 Min Read

Web Stories

బత్తుల పవన్‌ కళ్యాణ్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘పురుషః’. రాయంక కొక్కుర హీరోయిన్‌గా నటించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, విషిక, హాసిని సుధీర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వీరు ఉలవల దర్శకత్వంలో బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో బత్తుల పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ-”సప్తగిరి, కసిరెడ్డిగార్లు నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. నాకున్న సిగ్గు, భయం, బిడియాన్ని పొగొట్టారు. వెన్నెల కిషోర్ గారితో, రాజీవ్ కనకాల గారితో, వీటీవీ గణేష్ గారితో వర్క్ చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. మా నాన్న కోటేశ్వరరావు కష్టం చూస్తూ పెరిగాను. నా కోసం మా అక్క సరస్వతి ఎంతగానో కష్టపడుతుంటారు. ‘పురుషః’ మూవీ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఫుల్‌ ఎంటర్‌టైన్‌ అవుతారు. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్‌లో మా సినిమాను చూడండి” అని చెప్పారు.

Purushaha pre Release event

”వీరుగారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు, నేను కొన్ని ఇన్‌పుట్స్‌ చెప్పాను. కానీ, ఆయన తన దారిలోనే వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడో గానీ కోటేశ్వరరావు గారి లాంటి తండ్రి, సరస్వతి గారి లాంటి అక్క దొరికారు” అని అన్నారు సప్తగిరి.

వీరు ఉలవల మాట్లాడుతూ-”సరస్వతిగారి వల్లే, ‘పురుషః’ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. రాజ్‌కుమార్‌గారి కామెడీ టైమింగ్‌ బాగుంది. సప్తగిరిగారు నవ్విస్తారు. పవన్‌కల్యాణ్‌ ఎక్కడా కొత్తహీరోలా నటించలేదు. మా సినిమాను అందరు థియేటర్స్‌లో చూసి, సక్సెస్‌ చేయాలి” అన్నారు.

నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ-”మా అమ్మ తరువాత సినిమానే నా గురువు. సినిమా నాకెంతో నేర్పింది. సినిమా తీయాలన్న నా ఆకాంక్షను నెరవేర్చిన నా కుమారుడు పవన్‌కల్యాణ్‌కు థ్యాంక్స్‌” అని చెప్పారు.

నిర్మాత సరస్వతి బత్తుల మాట్లాడుతూ- ”కాలేజీ టైంలో స్టోరీలు రాసుకునేదాన్ని, డైరెక్టర్ అవ్వాలని అనుకునే దాన్ని. కానీ ఎప్పుడూ నా ఆలోచనల్ని బయట పెట్టలేదు. నా తమ్ముడిని నేను అన్నలా చూసుకోవాలని ఈ మూవీని తీశాను. నాకు నా తమ్ముడే సర్వస్వం. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మే 22న మా సినిమా రాబోతోంది. కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. అందరూ వచ్చి చూసి మా మూవీని సక్సెస్ చేయండి’ అని అన్నారు.

‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరోయిన్ తేజస్వీ రావ్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, కెమెరామెన్ సతీష్ ముత్యాల, మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్, ఆర్ట్ డైరెక్టర్ రవి, ఎడిటర్ కోటి మాట్లాడి, తమ సినిమాను ప్రేక్షకులు థియేటర్స్‌లో చూసి, ఈ సినిమాకు విజయం చేకూర్చాలని మాట్లాడారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi