మకుటం…రైజ్‌ ఆఫ్‌ లింగ

Viswa
1 Min Read
Rise Of Linga From Vishal’s Makutam Movie

Web Stories

Vishal’s Makutam: హీరో విశాల్‌ తొలిసారి దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న సినిమా ‘మకుటుం’ (Makutam Movie). రవి అరుసు ఈ సినిమాకు కథ అందించారు. దివంగత ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి 99వ చిత్రం ఇది. విశాల్‌ కెరీర్‌లోని ఈ 35వ సినిమా జూలైలో రిలీజ్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రైజ్‌ ఆఫ్‌ లింగ’ (Rise Of Linga) అంటూ సాగే, ఈ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ చిత్రం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌తో కలిసి, ఈ పాటను పాడారు విశాల్‌.

ఈ సినిమాలో విశాల్‌ లింగ అనే పాత్రలో నటిస్తారు. మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో విశాల్‌ కనిపిస్తారు. విశాల్‌ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. వైజాగ్‌ నేపథ్యంతో సాగే చిత్రం ఇది. ఇందులో సముద్రపు డాన్‌గా విశాల్‌ కనిపిస్తారు. సముద్రపు రవాణా, మాఫియా నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu