వాళ్లు పశ్చాత్తాపడతారు

Viswa
2 Min Read

Web Stories

TheRajassab Director Maruthi: ఎన్నో అంచనాల మధ్య ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ‘ది రాజాసాబ్‌’ సినిమా విడుదలైంది. కానీ ఈ సినిమా ఆడియన్స్‌ అంచనాలను అందుకోలేకపోయింది. పైగా ఈ సినిమాను గురించి సోషల్‌ మీడియా లో ట్రోలింగ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ట్రోలింగ్‌ గురించి దర్శకుడు మారుతి చేసిన వ్యాఖ్యలు చర్చ నీయాంశమైయ్యాయి.

రీసెంట్‌ టైమ్స్‌లో ప్రతి సినిమాపై ట్రోలింగ్‌ జరుగుతోంది. ‘అఖండ 2, ఓజీ, మనశంకరవప్రసాద్‌గారు, ది రాజాసాబ్‌..ఇలా అన్నీ సినిమాలపై ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది. అకారణంగా ట్రోల్‌ చేసేవారికి నేచరే సమాధానం చెబుతుంది. భవిష్యత్‌లో వాళ్ళు మనం బాధపడేది, గతంలో ట్రోలింగ్‌ చేసినందుకా అని పశ్చాత్తాపడొచ్చు. వాళ్లు దేవుడికి ఆన్సర్‌ చెప్పాల్సిందే అంటూ మాట్లాడారు మారుతి.

రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి సినిమా ఫస్ట్‌ రివ్యూ

ఇంకా ‘ది రాజాసాబ్‌’ సినిమాకు మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి. మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఈ తరహా కొత్త చిత్రం చూసినప్పుడు, ఈ సినిమా అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ విషయాన్ని మేం ముందుగానే ఊహించాము. ప్రభాస్‌గారు కూడా ఇదే చెప్పారు. సరైన ఫెస్టివ్‌ మూడ్‌ స్టార్ట్‌ కాకుండానే మా సినిమా రూ. 200 కోట్ల రూపాయాల కలెక్షన్స్‌ను రాబట్టింది. భవిష్యత్‌లో మరింత విజయవంతంగా ప్రదర్శించబడుతుందని మారుతి చెప్పుకొచ్చారు.

ప్రభాస్‌ ది రాజాసాబ్‌ రివ్యూ

అలాగే ‘ది రాజాసాబ్‌’ సినిమాను తొలుత హారర్‌ కామెడీగా స్టార్ట్‌ చేసి, ఆ తర్వాత హారర్‌ ప్యాంటసీగా అనుకున్నాం. ఆ తర్వాత సైకాలజికల్‌ అంశాన్ని ఏటాచ్‌ చేశాం. ది రాజాసాబ్‌ సినిమాలో సైకలాజికల్‌ టచ్‌ ఉందని, మైండ్‌గేమ్‌ ఉందని ఆడియన్స్‌ను ముందే ప్రిపేర్‌ చేసి ఉంటే బాగుండేదె మోనని మారుతి పరోక్షం గా చెప్పుకొచ్చారు.

చిరంజీవి మనశంకరవరప్రసాదుగారు ఫస్ట్‌ రివ్యూ

ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌ చేసిన ‘ది రాజాసాబ్‌ ’ సినిమాలో మాళవికామోహనన్, నిధీ అగర్వాల్, రిద్ది కుమార్‌లు హీరోయిన్స్‌గా నటించగా, బొమన్‌ ఇరానీ, సంజయ్‌దత్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్‌లు ఈ సినిమాను నిర్మించారు.

Please Share
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu