మరో ఫ్రాంచైజీకి సిద్ధమైన ప్రభాస్‌?

Viswa
1 Min Read

Web Stories

Spirit: హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌తో రానున్న సినిమా ‘స్పిరిట్‌ (Spirit)’. ఈ పాటికే, ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావాల్సింది. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. అయితే ఈ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లే సమయం ఆసన్నమైంది.ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తారు. భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌రెడ్డి వంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. తరుణ్‌, శ్రీకాంత్‌, దక్షిణ కొరియా నటుడు డాన్లీలు ఈ సినిమాలో భాగమౌతారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘స్పిరిట్‌’ సినిమా చిత్రీకరణ మొదలైయ్యేలా, సందీప్‌రెడ్డి వంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కథ ప్రధానంగా ముంబై నేపథ్యంతో సాగుతుందట. అందుకే ‘స్పిరిట్‌’ సినిమా చిత్రీకరణను ముందుగా, ముంబైలో మొదలుపెట్టి, ఆ తర్వాత మెక్సికో, ఇండోనేషియా, యూకే లొకేషన్స్‌లో చిత్రీకరిచాలని సందీప్‌రెడ్డి వంగా అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది.

మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే…‘స్పిరిట్‌’ సినిమా కూడా ఫ్రాంచైజీ మూవీనే అట. ఆల్రెడీ ‘సలార్, రాజాసాబ్‌’ ఫ్రాంచైజీ సినిమాలతో ప్రభాస్‌ బిజీగా ఉండబోతున్న ఈ తరు ణంలో, ఈ పాన్‌ ఇండియా హీరో నుంచి మరో ఫ్రాంచైజీ అనేది కూసింత ఆశ్చర్యకరమైన విషయమే. మరి…‘స్పిరిట్‌’ సినిమా హిటై్టతే, ‘స్పిరిట్‌ 2’ ఉంటుంది. లేకపోతే లేదు. ఈ ఫ్రాంచైజీ బిల్డ్‌ అయ్యే బాధ్యత అంతా ఇప్పుడు సందీప్‌రెడ్డివంగాపైనే ఉంది.

మరోవైపు ప్రభాస్‌ లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమా జనవరి 9న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ప్రభాస్‌ చేస్తున్న మరో సినిమా ‘ఫౌజి’ వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్‌ కావొచ్చు.

 

Please Share
Share This Article
98 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu