ఫ్రెండా?…లవరా?

Viswa
1 Min Read

Web Stories

Aatu Friend Ittu Lover movie: ప్రిన్స్, సాంచి కశ్యప జంటగా నటించిన సినిమా ‘అటు ఫ్రెండ్‌ ఇటు లవర్‌’ (Aatu Friend Ittu Lover movie). నజీం. ఎస్‌ దర్శకత్వంలో ఫ్యాషన్‌ హంట్‌ బ్యానర్‌ పతాకంపై ప్రిన్స్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌ కానుంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ అండ్‌ సరికొత్త లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ వేడుకలో ప్రిన్స్‌ మాట్లాడుతూ–‘‘మా టీమ్‌ అందరి సహకారంతో, మేం అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. తెలుగు ఆడియన్స్‌ మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి ఆదరణే, మా సినిమాకూ లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ క్రమంలో నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు.

సాంచి కశ్యప మాట్లాడుతూ–‘‘అటు ఫ్రెండ్‌ ఇటు లవర్‌’ సినిమాలో నటించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాం’’ అని చెప్పారు.

డైరెక్టర్‌ నజీం ఎస్‌ మాట్లాడుతూ– ‘‘అటు ఫ్రెండ్‌ ఇటు లవర్‌’ సినిమాను మేమంతా కలిసి గొప్పగా తెరకెక్కించాం. ప్రిన్స్, సాంచి మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు’’ అని చెప్పారు.

ఈ చిత్రం సంగీత దర్శకుడు ప్రణీత్, కెమెరామెన్‌ రాము రాయల్‌ మాట్లాడి, ఈ సినిమా ప్రేక్షకులందర్నీ అలరిస్తుందని చెప్పారు. అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi