బ్యాంకాక్‌లో స్పెషల్‌ ట్రైనింగ్‌….కేరళలకు మైసా

Viswa
1 Min Read

Web Stories

Rashmika Mandanna Special Training: యాక్షన్‌ స్టంట్స్‌లో స్పెషల్‌ ట్రైనింగ్‌  (Mysaa) తీసుకుంటున్నారు హీరోయిన్‌ రష్మికా మందన్నా. ప్రస్తుతం బ్యాంకాక్‌ లో ఉన్నారు రష్మిక. అక్కడే రష్మిక ట్రైన్‌ అవుతున్నారు. రోజులో మూడోవంతు అంటే..దాదాపు ఎనిమిది గంటల పాటుగా, నిపుణుల పర్యవేక్షణలో ఆమె యాక్షన్‌ స్టంట్స్‌ కోసం శిక్షణ తీసుకుంటున్నారు. ఇదంతా రష్మిక మందన్నా చేస్తున్న తాజా ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘మైసా’ కోసమే.

రవీంద్ర పుల్లె దర్శకత్వంలోని ఈ పాన్‌ ఇండియా సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ సంస్థ వారు నిర్మిస్తున్నా రు. ఈ చిత్రంలో గొండు తెగకు చెందిన వీరనారిగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా నెక్ట్స్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ను అతి త్వరలోనే కేరళలో ప్రారంభించ నున్నారు మేకర్స్‌. ఈ కేరళ షూట్‌ షెడ్యూల్‌లోనే, రష్మికా పాల్గొనగా, కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను
చిత్రీకరించనున్నారు. ఈ షూట్‌ కోసమే రష్మిక ముందుగా బ్యాకాంక్‌లో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు.

ఇందులో రష్మిక మందన్నా తల్లి పాత్రలో ఈశ్వరీరావు నటిస్తున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలో గురు సోమసుందరం, రావు రమేష్‌ ఇతర కీలక పాత్రధారులు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం ఇప్పుడు ఈ వేసవిలో రిలీజ్‌ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కానీ ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్‌ అవుతుంది. అతి త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తారు మేకర్స్‌.

Please Share
Share This Article
111 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu