బర్త్‌ డేకి గీతాంజలి

PR
PR
1 Min Read

Web Stories

Geethanjali ReRelease: నాగార్జున హీరోగా నటించిన ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘గీతాంజలి’. ఈ చిత్రంలో గిరిజ హీరోయిన్‌గా నటించగా, మణిరత్నం దర్శకత్వం వహిం చారు. 1989 మే 12న విడుదలైన ‘గీతాంజలి’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా, తెలుగు, తమిళ భాషల్లో 4కే ఫార్మాట్‌లో ఈ సినిమా రక్షాబంధన్‌ సందర్భంగా ఆగస్టు 28న రీ రిలీజ్‌ (Geethanjali ReRelease date)  కానుంది. శ్రీ పద్మిని సినిమాస్‌ పతాకంపై బూర్లె శివ ప్రసాద్‌ ఈ సినిమాను అధునాతన సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

మరోవైపు ప్రస్తుతం నాగార్జున ‘కింగ్‌ 100’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆర్‌ఏ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఆగస్టు 29న నాగార్జున బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘కింగ్‌ 100’ సినిమాను గురించిన అప్‌డేట్ రావొచ్చిని తెలుస్తోంది. టబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu