January 12 Vidudala Cinema: 2024కి సంక్రాంతికి ‘సంక్రాతికి వస్తున్నాం ‘ సినిమా తో, 2025 సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు ‘ మూవీ తో సూపర్ హిట్స్ కొట్టారు అనిల్ రావిపూడి. ఆయన డైరెక్షన్ లోని తాజా సినిమా ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) సినిమా కూడా సంక్రాంతి సందర్బంగానే… వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజ్ కానుంది.వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా లో కీర్తి సురేష్, కృతిశెట్టి హీరోయిన్స్. వెంకటేష్ సరసన కీర్తి, కళ్యాణ్ రామ్ కు జోడీ గా కృతి శెట్టి యాక్టింగ్ చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే సినిమా ఇది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అదికారికంగా (January 12 Vidudala Cinema Release date) ప్రకటించారు మేకర్స్.
సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, షైన్ స్క్రీన్ బ్యానర్స్ పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమా లో వెంకటేష్, కృతి శెట్టి అన్న చెల్లెల్లు గా, కళ్యాణ్ రామ్ – కీర్తి సురేష్ అక్క తమ్ముడి లా యాక్టింగ్ చేస్తున్నారు. వెంకటేష్ సిస్టర్ ను కళ్యాణ్ రామ్, కళ్యాణ్ రామ్ సిస్టర్ ను వెంకటేష్ వివాహం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే కామెడీ, బావోద్వేగాలు ఈ మూవీ లో హైలైట్ గా ఉంటాయి. ఇక ఈ సినిమా లో మిలిటరీ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్ నటిస్తున్నారు. ఓ విలేజ్ లోని యువకుడిగా కళ్యాణ్ రామ్ కనిపిస్తారు.