KlinKaara Konidela Photo: హీరో రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసనల తొలి సంతానం క్లీంకార కొణిదెల (KlinKaara Konidela ) ఫోటోను ఎట్ట కేలకు అధి కారికంగా విడుదల చేశారు. జూన్ 20న క్లీంకార బర్త్ డే. క్లీంకార మూడో పుట్టినరోజు సందర్భంగా, ఈ చిన్నారి ఫోటోను సోషల్‌మీడియా మాధ్యమాల వేదికగా షేర్ చేశారు రామ్‌చరణ్, ఉపాసన. దీంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్, షేర్స్, లైక్స్ చేస్తూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
రామ్‌చరణ్–ఉపాసన దంపతులు 2023లో క్లీంకారకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 31న ఈ దంపతులకు కవలలు జన్మించారు. వీరికి శివరామ్, అన్వీరాదేవి అని నామకరణం చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే…‘రంగస్థలం’ తర్వాత సుకుమార్‌తో రామ్‌చరణ్ మరో సినిమా చేయాల్సి ఉంది. త్వర లోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. రామ్‌చరణ్ మేకోవర్‌పై, అటు ఈ సినిమా కథపై సుకు మార్‌లు ఫుల్ బిజీగా ఉన్నారని తెలిసింది.