ఏడు గెటప్స్‌లో సత్యదేవ్‌…రామప్ప ఫెవరేట్‌

Viswa
1 Min Read

Web Stories

Desa Sanchari song: సత్యదేవ్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన సినిమా ‘రావు బహదూర్‌’ (Rao Bahadur Movie). దీపా థామస్‌ ఈ సినిమాలో కథానాయికగా నటించారు. మహేశ్‌బాబు–నమ్రతల జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర నిర్మించిన ఈ ‘రావు బహదూర్‌’ సినిమా జూలై 3న రిలీజ్‌ కానుంది. హైదరా బాద్‌లో ఈ సినిమాలోని ‘దేశ సంచారి’ అనే పాటను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. స్మరణ్‌ సాయి సంగీత స్వరకల్పనలో రెహమాన్‌ సంగీతం అందించిన ఈ పాటను హేమచంద్ర, ప్రియాంకా గజానన్‌ పాడారు.

RaoBahadur second single DesaSanchari out now Event
RaoBahadur second single DesaSanchari out now Event

ఈ ‘దేశ సంచారి’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఈ చిత్రం హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేను ఏడు గెటప్స్‌లో కనిపిస్తాను. నాకు నచ్చిన గెటప్‌ రామప్ప. నా కెరీర్‌లోనే ఎక్కువగా నేను డ్యాన్స్‌ చేసిన సినిమా ఇది. ఇందులో సల్సా స్టయిల్‌ డ్యాన్స్‌ చేశాను. ఈ తరహా డ్యాన్స్‌ చేయాలంటే పదేళ్ల సాధన కావాలి. నాకు ఎంతో ఓపికిగా నేర్పించిన మా డ్యాన్స్‌ మాస్టర్స్‌కు ధన్యవాదాలు’’ అని చెప్పారు.

ఈ రావు బహదూర్‌ సినిమాలో సత్యదేవ్‌ చేసిన ప్రతి గెటప్‌కి ప్రత్యేకమైన పెర్ఫార్మెన్స్‌ను ఆడియన్స్‌ చూస్తారు అని నిర్మాత అనురాగ్‌ చెప్పారు. ప్రతి విషయాన్ని చాలా సులువుగా అర్థం చేసుకునే వ్యక్తి సత్యదేవ్‌ అని కొనియాడారు ఈ చిత్రం దర్శకుడు వెంకటేశ్‌ మహా.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu