ఎవరే పాట సక్సెస్‌ కావాలి: హీరో అర్జున్‌ అంబటి

Viswa
2 Min Read

Web Stories

వెచలపు కృష్ణ, రిద్ది అనామిక, చరణ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన సాంగ్‌ ఆల్భమ్‌ ‘ఎవరే..’. అనిశ్రీ ఎంటర్‌టైన్మె ంట్స్‌ పతాకంపై వెంకట కళ్యాణ్‌ మండవిల్లి సమర్పణలో శిరీష మండవిల్లి నిర్మించారు. మే 1 నుంచి క్రేజీ ఎన్‌ క్యాచీ యూట్యూబ్‌ చానెల్‌లో ఈ సాంగ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. బుధవారం ఈ సాంగ్‌కు చెందిన రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అర్జున్‌ అంబటి, సింగర్‌ సాకేత్, రాంబాబు గోసాల ముఖ్య అతిథిగా విచ్చే శారు.

అర్జున్‌ అంబటి మాట్లాడుతూ–‘‘ఎవరే’ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌. నిర్మాత బాగుంటేనే మళ్లీ ఇంకో పాటను గానీ, సినిమానుగానీ తీస్తారు. పవన్‌కల్యాణ్‌ పాట పాడుతూ ఉంటే, నేను పెర్ఫార్మ్‌ చేశాను. పవన్‌ సింగర్‌గా ఇం కా మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. వర్ధన్‌ మ్యూజిక్‌ బాగుంది. కృష్ణ, రిద్ధి జంట బాగుంది. కృష్ణ పక్కంటి అబ్బాయిలా కనిపిస్తున్నారు. ‘ఎవరే’ పాట మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

‘‘పవన్‌కల్యాణ్, అనన్య చక్కగా పాడారు. పాటలో మెలోడీ, ఎనర్జీ రెండూ చక్కగా కుదిరాయి. తమన్‌ అన్న స్థాయిలో ఎస్‌ఎస్‌ వర్ధన్‌ సక్సెస్‌ కావాలి’’ అన్నారు సింగర్‌ సాకేత్‌.

‘‘ఎవరే’ సాంగ్‌ ప్రోమో చూశాను. చాలా నచ్చింది. లిరిక్స్‌ బాగున్నాయి. ‘ఎవరే..’ సాంగ్‌ పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాంబాబు గోసాల.

‘‘ఎవరే..’ పాట కోసం మేం ఏడాది నుంచి వర్క్‌ చేస్తున్నాం. నా విజన్‌కి తగ్గట్లుగా సపోర్ట్‌ చేసిన ఆనంద్, కృష్ణలకు థ్యాంక్స్‌. పవన్, అనన్యలు మా పాటను నెక్ట్స్‌ లెవల్‌లోకి తీసుకుని వెళ్లారు. వల్లభ అన్నతో నేను నాలుగేళ్లుగా పని చేస్తున్నాను. మే 1న మా పాట రాబోతుంది. అందరూ చూసి సపోర్ట్‌ చేయండి’’ అన్నారు సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ వర్థన్‌.

Evare song Album

‘‘ఏడాది క్రితం ‘ఎవరే’ కాన్సెప్ట్‌ను అనుకున్నాం. మే1న క్రేజీ ఎన్‌ క్యాచీ యూట్యూబ్‌ చానెల్‌లో ఈ సాంగ్‌ రిలీజ్‌ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్‌ చేయండి’’ అని చెప్పారు దర్శకుడు ఆనంద్‌.

‘‘ఎవరే’ నాకు ఎంతో ప్రత్యేకం. ఆనంద్, వర్ధన్‌ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. శిరీష మండపల్లిగారి సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. మే 1న పాటను యూట్యూబ్‌ రిలీజ్‌ కాబోతోంది’’ అని చెప్పారు వేచలపు కృష్ణ.

‘‘తెలుగులో ఇదే నాకు ‘ఎవరే..’ తొలి ప్రాజెక్ట్‌. అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని చెప్పారు రిద్ది అనామిక.

‘ఎవరే’ పాటలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ పాటలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. మా పాటను వైరల్‌ చేయండి’’ అని చెప్పారు సింగర్‌ పవన్‌ కళ్యాణ్, సింగర్‌ అనన్య భాస్కర్‌ , లిరిక్‌ రైటర్‌ మల్లిక వల్లభ పిట్ల మాట్లాడారు.

Please Share
Share This Article
113 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu