Dandora Movie Trailer: శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు (Dandora Movie Cast and Crew) లీడ్ రోల్స్‌లో నటించిన పీరియాడికల్ సినిమా ‘దండోరా’ (Dandora Movie). సామాజిక అసమా నతలు, ధనిక–పేద వర్గాల మధ్య తారతమ్యాలు..వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథ ఉంటుంది. ముఖ్యంగా కులవ్యవస్థను గురించి ఈ సినిమాను తీశారు మేకర్స్. ఓ ఊర్లో జరిగే కథ ఇది. ఊర్లో ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోయినప్పుడు, అతని అంత్యక్రియలు చేయడం కోసం జరిగే వివిధ నాటకీయ పరిణామాల నేపథ్యంతో ఈ ‘దండోరా’ సినిమా కథనం సాగు తుంది. మురళీ కాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ము ప్పానేని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్స్‌లో విడుదల అవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘మన చావు పుట్టకులన్నీ ఆ ఊరి బయట రాసిండ్రా ఆ దేవుడు..’
‘సరే అయితే మా అయ్యతోని మాట్లాడి ముహూర్తం పెట్టించు..డైరెక్ట్‌గా మండపానికి వస్తాను’
‘నాన్న లేడు అని చెప్పి ఇప్పుడేమో బాధ్యతలు చూపిస్తున్నాడు’
‘భయపడ్డావా.. పడాలి’
‘అయ్యిందేదో అయిపోయింది.. పెద్ద మనుషులు మీరే ఏదో ఒక పరిష్కారం చూపించండి’ ‘పరిష్కారం లేదు.. బొంగులేదు..వెళ్లి ఆ చెట్టు కింద కాల్చుకోండి’
‘చావు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కులం నుంచి తప్పించుకోలేం రా’ అని మురళీధర్ పాత్ర నందుతో చెప్పటం
‘ఒకటి పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర .. ఈ రెండింటిలోనే కదా వీళ్ల ఆటలు సాగేవి’
‘మన బతుకులు మారాలంటే మనకు కావాల్సిందొక్కటి.. చదువు..చదువు..చదువు’ అనే డైలాగ్స్ ఈ ‘దండోరా’ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.
అలాగే పెద్దజాతి, చిన్నజాతి అన్న తేడాల్లేవ్..మనందరం ఒక్కటే..’ అనే డైలాగ్ కూడా ఈ సినిమా పోస్టర్‌పై ఉంది. తెలంగాణ నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తుంది.
E aí, galera! Descobri esse tal de 2Q e fiquei curioso. Alguém já se aventurou por lá? Tem jogos legais? Me deem um feedback antes de eu me jogar de cabeça! Clica aqui: 2q
Bin88’s the place to be if you’re looking for a good time! Seriously, the variety of games is insane. I’ve been trying out new stuff every week. Solid platform, great experience. Highly recommend! bin88