please subscribe to Tollywoodhub YouTube channel

వరుణ్‌తేజ్‌ బరి..సంక్రాంతి గురి

Viswa
2 Min Read

Web Stories

Bhari Movie: వరుణ్‌తేజ్‌ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘బరి’ (Bhari Movie) అనే టైటిల్‌ ఫిక్స్‌ అయ్యింది. ఈ మూవీలో వరుణ్‌తేజ్‌ వాలీబాల్‌ ప్లేయర్‌గా కనిపిస్తారు. ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు యదు వంశీ ఈ సినిమాకు దర్శకుడు. ఇక వరుణ్‌తేజ్‌ సోదరి నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యదు వంశీ ద’ర్శకత్వంలో వచ్చిన ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాను కూడా నిహారిక కొణిదెలనే నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో, ‘బరి’ సినిమాను కూడ వచ్చే సంక్రాంతికి (Bhari Movie Release date) రిలీజ్‌ చేస్తామని ‘బరి’ మేకర్స్‌ చెప్పడం కాస్త ఆశ్చర్యపరచే అంశమే.

హైదరాబాద్‌లో జరిగిన ‘బరి’ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, నటుడు-నిర్మాత, సింగర్‌ పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ ఇచ్చారు. మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మాత నవీన్‌ ఎర్నేని కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

Bari movie Cinema Opening

తన సోదరి నిహారికతో ఓ సినిమా చేయాలని ‘బరి’ సినిమాను చేయడం లేదని, కథ నచ్చి ఈ సినిమాకు ఒకే చెప్పానని వరుణ్‌తేజ్‌ చెప్పారు. బరి సినిమాలో తాను వాలీబాల్‌ ప్లేయర్‌గా కనిపిస్తానని, ఇందుకోసం ప్రాక్టీస్‌ మొదలుపెట్టినట్లుగా వరుణ్‌ తెలిపారు. ప్రస్తుతం ‘బరి’ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని, వచ్చే సంక్రాంతికి తమ బరి సినిమాను బరిలోకి దించుతున్నామని వరుణ్‌ స్పష్టం చేశారు.

ఇక తన నిర్మాణసంస్థ పింక్‌ఎలిఫెంట్‌ పిక్సర్స్‌ పతాకంపై ఓ సినిమా వస్తుందంటే, ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుందనే నమ్మకం, ప్రేక్షకుల్లో కలిగేలా చేయడమే తన లక్ష్యమని నిహారిక చెప్పారు. పవన్‌కల్యాణ్‌ ఈ సినిమా ఓపెనింగ్‌కు రావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

కమిటీ కుర్రాళ్ళు విజయం తర్వాత, ఓ కథను ప్లాన్‌ చేశానని, కాకపోతే ఆ కథ కుదరలేదని , దీంతో ‘బరి’ కథను సిద్దం చేశానని యదు వంశీ చెప్పారు. వాలీబాల్‌ బ్యాక్‌డ్రాప్‌ కథ అనగానే తనకు వరుణ్‌తేజ్‌గారే గుర్తొచ్చారని, దీంతో నిహారిక ద్వారా ఈ కథను వరుణ్‌తేజ్‌కు వినిపించగా, కథ నచ్చి, ఈ సినిమాకు వరుణ్‌తేజ్‌ ఒకే చెప్పారని యదు వంశీ తెలి పారు. తమలాంటి యంగ్‌ టీమ్‌ను ప్రోత్సహించేందుకు పవన్‌కల్యాణ్‌గారు ‘బరి’ ఈవెంట్‌కు రావడం సంతోషాన్ని ఇచ్చిందని వంశీ ఆనందం వ్యక్తం చేశారు.

 

Please Share
Share This Article
4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi