వేరే ప్రపంచంలో యుద్ధం చేయాలి రాజాసాబ్‌

Viswa
2 Min Read
Therajasaab New Trailer TheRajasaab 2.o out now

Web Stories

TheRajasaab 2.o Trailer: ప్రభాస్‌ హీరోగా నటించిన ప్యాంటసీ హారర్‌ మూవీ ‘ది రాజాసాబ్‌’ (TheRajasaab 2.o Trailer). ఈ సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. జనవరి 8న ఈ సినిమా ప్రీమియర్స్‌ ను ప్లాన్‌ చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్‌లు (TheRajasaab Producers) ఈ సినిమా నిర్మాతలు. తమన్‌ మ్యూ జిక్‌ డైరెక్టర్‌. మారుతి ఈ సినిమా దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ఓ ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా ‘ది రాజాసాబ్‌ 2.ఓ’ అంటూ ఈ సినిమా కొత్త ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌లో ఈ కింది డైలాగ్స్‌ ఉన్నాయి.

‘‘నాన్నమ్మ…ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా…ఆయన్ని మాత్రం అస్సలు మర్చిపోలేవు’

‘మన టైమ్‌ స్టారై్టంది..లవ్‌ యూ..’

‘అలాగే రాజాసాబ్‌’

‘రేయ్‌ కనకరాజు నాకు నీ గురించి తెలుసుకోవాలని ఉంది బాగా…,నిన్ను చాలా మిస్‌ అవుతున్నా..’

‘చిక్కినవ్‌…చక్కగా వచ్చి వలలో పడినవ్‌…’

‘మిస్‌ యూ టు రాజాసాబ్‌’

‘ఈ ఇల్లు ఒక మయసభ, ఇక్కడికి రావడమే కానీ వెళ్లాలంటే మీ తాత సంతకం కావాలి..’

‘ప్రతిదీ హిప్నోటైజ్‌ చేసి, మీరు ట్రాన్స్‌లోకి వెళ్లేలా చేస్తున్నాడు..’

‘తాతొచ్చాడయ్యా..’

‘ఎవరూ ఎందులో వీక్‌ ఉంటారో, దాన్నే టార్గెట్‌ చేస్తాడు’

‘వేరే ప్రపంచం సృష్టించుకుని, ఆ వరల్డ్‌లో మనం ఉండి..ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి’

‘ఇక్కడ నుండి నీ కాలు కదలాలంటే..’

‘అయితే ఏంద్రా ఇప్పుడు..’

ఈ సినిమాలో రాజాసాబ్‌ పాత్రలో ప్రభాస్, రాజాసాబ్‌ తాతయ్య కనకరాజు పాత్రలో సంజయ్‌దత్, రాజాసాబ్‌ అమ్మమ్మ పాత్ర గంగమ్మ పాత్రలో జరీనా వాహాబ్‌ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో తాత–మనవడు, మనవడు–అమ్మమ్మల మధ్య ఉండే భావోద్వేగ సన్నివేశాలకు హారర్, ప్యాంటసీ, కామెడీ అంశాలను మిళితం చేసి, ఈ ‘రాజాసాబ్‌’ సినిమాను దర్శకుడు మారుతి సిద్ధం చేసినట్లుగా స్పష్టం అవుతోంది.

ఈ చిత్రంలో ఇంకా సప్తగిరి, వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్‌ వంటి హాస్యనటులు నటించగా, బోమన్‌ ఇరానీ మరో కీలక పాత్రలో యాక్ట్‌ చేశాడు. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్‌లు ఈ చిత్రంలోని హీరోయిన్స్‌ పాత్రల్లో కనిపిస్తారు.

Please Share
Share This Article
87 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu