Prabhas TheRajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ Prabhas TheRajasaab) సంక్రాంతి కానుకగా (జనవరి 8 నుండి) థియేటర్లలో రిలీజై ప్రభంజనం సృష్టిస్తోంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్‌తో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో మొసళ్లతో అభిమానులు చేస్తున్న హంగామా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమా విడుదలైనప్పటి నుండి థియేటర్లలో అభిమానులు మొసళ్లను పట్టుకుని కేకలు వేస్తున్న కొన్ని వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
ట్రైలర్‌లో ప్రభాస్ మొసలితో పోరాడే సన్నివేశాన్ని చూసిన ఫ్యాన్స్, థియేటర్లకు డమ్మీ మొసలి బొమ్మలను పట్టుకొచ్చి సందడి చేస్తున్నారు. ఇది వాస్తవం. అయితే, కొన్ని వీడియోల్లో మొసళ్లు నిజమైనవిగా కనిపిస్తూ అందరినీ భయపెడుతున్నాయి. నిశితంగా గమనిస్తే, ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించిన ఫేక్ వీడియోలని తెలుస్తోంది. ఓ వీడియోలో ప్రేక్షకుల సీట్లు ఒకవైపు ఉంటే, స్క్రీన్ మాత్రం మరోవైపు (కుడి పక్కన) ఉంది. దీన్ని బట్టి అది కేవలం ఎడిటింగ్ మహిమ అని స్పష్టమవుతోంది. మొసలి సీన్‌పై క్రేజ్ దర్శకుడు మారుతి ఈ చిత్రంలో ప్రభాస్‌కు, మొసలికి మధ్య ఉండే ఒక పోరాట సన్నివేశాన్ని అత్యంత ఆసక్తికరంగా డిజైన్ చేశారు.
ఈ సీన్‌పై ఉన్న హైప్ కారణంగానే అభిమానులు ఇలా మొసలి బొమ్మలతో వెరైటీగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇక రాజసాబ్ లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు. మొత్తం మీద ‘ది రాజాసాబ్’ మేనియా సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఫేక్ వీడియోల సంగతి పక్కన పెడితే, ప్రభాస్ వింటేజ్ లుక్స్ మరియు కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.