Toxic trailer: ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’ (Toxic Movie). ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ – అప్స్’ అనే ది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ తండ్రీకొడుకుల ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. గోవా తీర ప్రాంతంలో జరిగే ఈ మాఫియా పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ను వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్, కన్నడం ట్రైలర్స్‌ను బెంగళూరులో నిర్వహించారు.
‘‘నేను నిన్ను వదలి వెళ్లనమ్మ… ఆయనకు నా ముఖం చూడటం ఇష్టం లేదు’
‘నా ఆశ ఏంటో తెలుసా రాయా…ఈ సిటీని ఎలాలి’
‘అమ్మాయిలకు అందమే అసలైన సింగారం.. ఆ అందాన్నే ఆయుధంగా వాడితే ఎలా బంగారం…’
‘శాంతి వల్ల మారితే…శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగేవి…రా..’
‘ఇట్స్ టైమ్ ..ఐ యామ్ కమింగ్’
‘ప్రతి నిర్ణయానికి దానికి తగ్గ వెల కట్టి తీరాలి’
వంటి ఈ టాక్సిక్ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.
తలుచుకుంటేనే గూస్‌బంప్స్ వస్తాయి తెలుసా…
ఈ చిత్రంలో యశ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇంకా రుక్మిణీ వసంత్, నయనతార, తారా సుతారియా, హ్యూమాఖురేషి, కియారా అద్వానీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే… ఇది పూర్తిగా యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. అలాగే మితిమీరిన శృంగార, హింసా త్మక సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పెద్దలకు మాత్రమే అని చెప్పవచ్చు. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2’ వంటి సినిమాల తర్వాత యశ్ హీరోగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్నాయి. అలాగే ఇప్పటికే ఈసినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల ఫైనల్‌గా ఆగస్టు 26ను రిలీజ్ డేట్‌గా చెప్పారు మేకర్స్.అలాగే దర్శకురాలు గీతూమోహన్‌దాస్‌తో కలిసి యశ్ ఈ సినిమాకు కథ అందించడం విశేషం.