మెగాస్టార్ చిరంజీవి సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తే చూడాలని కోట్లాది మంది అభిమానుల కల. నిజానికి గతంలో రెండుసార్లు ఈ కాంబినేషన్ సెట్స్ వరకు వెళ్లి తృటిలో తప్పిపోయింది. అయితే, తాజాగా దర్శకుడు బాబీ ప్రాజెక్టుతో ఈ క్రేజీ కాంబో మళ్లీ పట్టాలెక్కబోతోందనే వార్త ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తోంది. 1999లో చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ కోసం రెహమాన్ సంతకం చేశారు.
చిరు పుట్టినరోజున జరిగిన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా కూడా వచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి’కి మొదట రెహమాన్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రకటించారు. అయితే ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల సమయం కేటాయించలేక ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా చిరు కొత్త సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే కదా..
తొలుత ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు మేకర్స్ ఏఆర్ రెహమాన్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ చరణ్ సినిమా టీజర్, ‘చికిరి చికిరి’ సాంగ్‌కు రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ క్వాలిటీ మెగా క్యాంప్‌ను ఇంప్రెస్ చేసింది. ఆ ఫ్రెష్ మ్యూజికల్ ఫీల్ తమ సినిమాకు కూడా కావాలని బాబీ టీమ్ భావిస్తోంది.వచ్చే దీపావళి లోపు మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని పక్కా ప్రణాళికతో చిత్ర యూనిట్ ఉంది. ఇక సంగీత దర్శకుడి విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.