Kiran Abbavaram IndraPutra Movie: కిరణ్ అబ్బవరం (KiranAbbavaram) హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘ఇంద్రపుత్ర’ (indraputra Movie) అనే టైటిల్ ఖరారైంది. తన కెరీర్‌లోని ఈ 15వ (KA15) మైథాలజీ సినిమాతో నూతన దర్శకుడు శ్రీకాంత్ పుప్పాల దర్శకుడిగా పరిచయం కానున్నారు. జీ స్టూడి యోస్, ప్రేరణా అరోరా నిర్మించనున్న ఈ కొత్త సినిమా షూటింగ్ అక్టోబరులో ప్రారంభం కానుంది. పురా ణ ఇతిహాసాల్లోని ధర్మానికి, అధర్మానికి మధ్య గల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మైథలాజీ, యాక్షన్, ఎమోషన్, ఫ్యాంటసీ వంటి అంశాల మేళవింపుతో భాషలకు అతీతంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఒక సరికొత్త పాత్రలో స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఈ సినిమాకు కీర్తన్ కథ అందించడంతో పాటుగా, కుస్సుమ్ అరోరాతో కలిసి సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఇంద్రపుత్ర: చాప్టర్ 1’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
మరోవైపు జాయ్ ఫిలింస్ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తూ, ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహిస్తు న్నారు కిరణ్ అబ్బవరం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం కిరణ్ కెరీర్‌లో 13వ సినిమా. అలాగే సుకుమార్ రైటింగ్స్ సంస్థలో కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇది కిరణ్ కెరీర్‌లో 14వ సినిమా. ఇక ఈ ఏడాది దీపావళికి కిరణ్ కెరీర్‌లోని 13వ సినిమా రిలీజ్ అయ్యే అవ కాశాలు ఉన్నాయి.