శర్వానంద్‌ ‘బైకర్‌’ సినిమా రివ్యూ

Viswa
3 Min Read

Web Stories

Biker Movie Review: కొంతకాలం వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడ్డ శర్వానంద్‌ ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో సక్సెస్‌ అందుకున్నాడు. ఈ తరుణంలో శర్వానంద్‌ నుంచి వచ్చిన మరో సినిమా ‘బైకర్‌’ (Biker Movie Review). ‘లూ జర్‌’ సిరీస్‌ ఫేమ్‌ అభిషేక్‌రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్‌ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌గా ‘బైకర్‌’ను ప్రమోట్‌ చేసుకున్నారు యూనిట్‌. మరి..‘బైకర్‌’ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా?
అసలు..ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చదివేద్దాం.

సినిమా : బైకర్‌ (Biker cinema Review)
ప్రధాన తారాగణం: శర్వానంద్, మాళవికా నాయర్, రాజశేఖర్, అతుల్‌ కులకర్ణి, బ్రహ్మాజీ
దర్శకుడు: అభిలాష్‌రెడ్డి
నిర్మాతలు యూవీ క్రియేషన్స్, వంశీ,ప్రమోద్, విక్రమ్‌
సంగీతంః జిబ్రాన్‌
కెమెరా: జే. యువరాజ్‌
ఎడిటింగ్‌: పి. అనిల్‌కుమార్‌
విడుదల తేదీ: ఏప్రిల్‌ 3, 2026
నిడివి రేటింగ్‌: 2 గంటల 42 నిమిషాలు

రేటింగ్‌ 2.75/5

కథ

భార్యభర్తలు వికాస్‌ నారాయణ్‌ (శర్వానంద్‌), అనన్య (మాళవికా నాయర్‌)లు తమ కుమారుడితో కలిసి ఓ సాధారణ జీవితం గడుపుతుంటారు. వికాస్‌ రేస్‌ ట్రాక్‌ను నిర్వహిస్తుంటే, అతని భార్య అనన్య బోటిక్‌ నిర్వహిస్తుంటుంది. ఇలా వీరి జీవితం సాఫీగా సాగిపోతుంటుంది. సడన్‌గా సునీల్‌ నారాయ ణన్‌ (రాజ శేఖర్‌)పై అవినీతి ఆరోపణులు వస్తాయి. ఈ సునీల్‌ ఎవరో కాదు..వికాస్‌ తండ్రి, మాజీ మోటోక్రాస్‌ రేసర్‌. దీంతో వికాస్‌ నారాయణ్‌ మళ్లీ రేసర్‌గా పోటీలో పాల్గొనాల్సి వస్తుంది. అసలు..తండ్రి సునీల్‌తో వికాస్‌కు వచ్చిన విబేధాలు ఏమిటి? తండ్రి–తనయుల మధ్య దూరం పెరగడానికి కారణం ఏంటి? ఇండియాలోనే బెస్ట్‌ మోటోక్రాస్‌ రేసర్‌గా పేరుగాంచిన వికాస్, తన తండ్రి సునీల్‌కి ఎందుకు దూర కావాల్సి వచ్చింది? వికాస్‌ జీవితంపై, అనన్య ప్రభావం ఎంత?  అన్న ఆసక్తికరమైన విషయాలను వెండితెరపై చూడాలి (Sharwanand Biker Movie Review)

విశ్లేషణ

స్పోర్ట్స్‌ ఏదైనా…ఈ జానర్‌లో వచ్చే సినిమాలన్నీ ఒకింత మూసధోరణితో ఉంటాయి. అంటే..హీరో ప్యాషన్‌ తో తన స్పోర్టింగ్‌ కెరీర్‌ను ఎంచుకోవడం, ఆ తర్వాత ఏవో కారణాలతో ఫెయిల్‌ కావడం, ఫైనల్‌గా సక్సెస్‌ కావడం. ఇదే టెంపోలోనే ‘బైకర్‌’ సినిమా కూడా ఉంటుంది. అయితే ఈ చిత్రంలో స్పోర్ట్స్‌ డ్రామాకు స్ట్రాంగ్‌ఎమోషన్స్‌తో ముడి వేశాడు దర్శకుడు. ముఖ్యంగా తండ్రి–కొడుకుల ఎమోషన్‌.

Baiker Movie Review

సినిమా కాస్త స్లోగా స్టారై్టనా, ఆ తర్వాత మెల్లిగా స్పీడ్‌ ట్రాక్‌ ఎక్కుతుంది. అయితే హీరో రేసింగ్‌ను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? మళ్లీ ఎందుకు స్టార్ట్‌ చేయాల్సి వచ్చిందన్న విషయాలను దర్శకుడు కన్వెన్సింగ్‌గా చెప్పగలిగాడు. మలేషియా రేస్‌ ట్రాక్‌ డ్రామా, క్లైమాక్స్‌లో జర్మనీలో రేసింగ్‌ సీన్స్‌ బాగున్నాయి. రేసింగ్‌ సన్నివేశాలను ఉన్నతంగా తీశారు దర్శకుడు. కానీ కథలో కాస్త నాటకీయత లోపించింది. రోటీన్‌ సీన్స్, ప్రిడక్ట్‌బుల్‌ సీన్స్‌ బాగానే ఉన్నాయి. నిడివి కూడ కాస్త ఎక్కువనే ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఓ కొత్త తరహా జానర్‌లో సినిమాను చూసిన అనుభూతి అయితే ఆడియన్స్‌కు కలుగుతుంది.

 

నటీనటులు సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్‌

వికాస్‌ నారాయణ్‌గా శర్వానంద్‌ మంచి నటన కనబరిచారు. యంగ్‌ ఏజ్‌లో ఉన్న బైకర్, ఆ తర్వాత కాస్త ఏజ్డ్‌గా ఉన్న బైకర్‌…లుక్స్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఈ వేరియేషన్, ఈ సినిమా కోసం శర్వానంద్‌ పడ్డ కష్టం స్క్రీన్‌పై తెలుస్తోంది. యాక్షన్‌ సన్నివేశాలతో పాటుగా, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ శర్వానంద్‌ నేచురాలిటీ కనిపిస్తుంది. సునీల్‌ నారాయణ్‌ అలియాస్‌ బుల్లెట్‌ సునీల్‌ రోల్‌లో రాజశేఖర్‌ తన సీనియారిటీ మార్క్‌ యాక్టింగ్‌ చూపించారు. ఇక హీరోయిన్‌కు ప్రాధన్యత ఉన్న పాత్రలో మాళవికా నాయర్‌ నటంచారు. జిబ్రాన్‌ పాటలు, ఆర్‌ఆర్‌ ఒకే. మోటోక్రాస్‌ రేస్‌ను సహజంగా చూపించడంలో దర్శకుడు అభిలాష్‌రెడ్డి సక్సెస్‌ అయ్యారు. ‘ప్రతి కొడుకు యుద్ధంలో తండ్రే మొదటి సైనికుడు’ అంటూ…తన కలం పవర్‌కూడా చూపించారు అభిలాష్‌. నిర్మాణ విలువలు సూపర్‌గా ఉన్నాయి. మోటోక్రాస్‌ రేసింగ్‌ విజువల్స్‌ బాగున్నాయి.

ఫైనల్‌గా: మోటోక్రాస్‌ రేసింగ్‌ బైకర్‌ ఫ్యామిలీ ట్రాక్‌పై చేసిన రేసింగ్‌నే ఈ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతుంది. రేసింగ్‌ విజువల్స్, రేసింగ్‌ సీన్స్‌ థ్రిల్‌ని ఇస్తాయి. కానీ కథ, కథనాల్లో కొత్తదనం లేని కూడా కనిపిస్తుంది.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi