టాక్సిక్ లో యశ్ తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

Kumar NA
2 Min Read

Web Stories

Natalie Burn: సినిమా ప్రపంచంలో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ తెచ్చుకోవడం అందరికీ సాధ్యం కాదు. కానీ, కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’.. ఒక విదేశీ నటిని ఒక్కసారిగా వార్తల్లో నిలిచేలా చేసింది. ఆమె పేరే నటాలీ బర్న్ (Natalie Burn). యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘రాయ ఇంట్రడక్షన్ గ్లింప్స్’ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది (Natalie Burnin yash Toxic Movie).

గ్లింప్స్‌లో యశ్ ఒక కారులో ఒక విదేశీ భామతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తారు. కేవలం కొన్ని సెకన్ల పాటు కనిపించిన ఆ నటి ఎవరబ్బా? అని నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆ చిన్న సీన్‌తో నటాలీ బర్న్ పేరు ఇప్పుడు ఇండియా మొత్తం వైరల్ అవుతోంది. నిజానికి ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నటాలీ బర్న్ ఉక్రేనియన్-అమెరికన్ నటి. హాలీవుడ్‌లో ఇప్పటికే అనేక యాక్షన్, థ్రిల్లర్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతమైన ప్రావీణ్యం ఉన్న ‘యాక్షన్ క్వీన్’. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా హాలీవుడ్‌లో పలు సినిమాలను తెరకెక్కించారు.

ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. నటాలీ బర్న్ ‘టాక్సిక్’ చిత్రంలో కేవలం నటి మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్‌కు ఆమె సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారట. తాను భాగస్వామిగా ఉన్న సినిమాలో నటించడం ఆమెకు ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ వంటి అగ్ర తారలు నటిస్తుండగా, నటాలీ బర్న్ రాకతో సినిమాకు ఇంటర్నేషనల్ అప్పీల్ పెరిగింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్-వరల్డ్ స్థాయిలో భారీ అంచనాల మధ్య నిర్మితమవుతోంది. యశ్‌తో నటాలీ కెమిస్ట్రీ, ఆమె యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాలో ఏ స్థాయిలో ఉంటాయో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi