చేతబడికి కమిటైన జేడీ చక్రవర్తి

Viswa
1 Min Read

Web Stories

J. D. Chakravarthy Chethabadi Movie: జేడీ చక్రవర్తి మెయిన్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్న సినిమాకు ‘చేతబడి’ (Chethabadi Movie) అనే టైటిల్‌ ఖరారైంది. ఏప్రిల్‌ 16న జేడీ చక్రవర్తి బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘చేతబడి’ సినిమా ప్రీ లుక్‌ పోస్టర్‌ను రిలీజైంది (Chethabadi Movie PreLook). వాస్తవ సంఘటనలఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో జేడీ చక్రవర్తి హీరోగా నటించనుండటంతో పాటుగా, విలన్‌ గానూ నటించనున్నారు. హారర్‌ అండ్‌ మిస్టరీ అంశాల మేళవింపుతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా చిత్రీ కరణ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలుగు, తమిళం హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మాణంలో సూర్యాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

J. D. Chakravarthy Chethabadi Film saregama have rights

ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాకముందే, ఈ మూవీ ఆడియో రైట్స్‌ను ప్రముఖ ఆడియో కంపెనీ సరిగమ దక్కించుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఐదుభాషల ఆడియో హక్కులు సరిగమ సంస్థకు సొంతమైయ్యాయి. ‘‘సాధారణంగా ఒక సినిమా నుంచి ఒక పాటవిడుదల అయితే, ఈ పాట మిగతా ఐదు భాషల్లో రిలీజ్‌ అవుతుంది. కానీ మా సినిమాలో తెలుగులోఒక పాట ఉంటే, సేమ్‌ విజువల్స్‌తో, మిగతా భాషల్లో మరో లిరిక్స్‌తో ఇతర పాటలు ఉంటాయి.మా సినిమాకు ప్రముఖ లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌గారు భాగమైయ్యారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు’’ అని యూనిట్‌ పేర్కొంది.

Please Share
Share This Article
83 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu