హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా రష్మిక.. ఎంత పన్ను కట్టిందో తెలిస్తే షాకే..?

Kumar NA

Web Stories

Rashmika Mandanna income: నేషనల్ క్రష్ రశ్మిక మందన్న పాపులారిటీలోనే కాదు, ఆదాయంలోనూ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. తాజాగా ఆమె పన్ను చెల్లింపుల విషయంలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం మూడు త్రైమాసికాలలోనే రశ్మిక (Rashmika Mandanna) ఏకంగా రూ. 4.69 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన రశ్మిక, ఆ జిల్లాలోనే అత్యధికంగా పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచింది. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత ఆమె సంపాదన, ఆస్తుల విలువ భారీగా పెరిగింది.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రశ్మిక రూ. 9 కోట్ల నుండి 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. దీనికి తోడు పలు అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీగా ఆర్జిస్తోంది. కొడగులోని విలాసవంతమైన బంగ్లాతో పాటు బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన ఇల్లు ఆమెకు ఉంది. హైదరాబాద్, గోవా, కూర్గ్ వంటి ప్రాంతాల్లోనూ ఆమెకు ఆస్తులు ఉన్నాయి. ఇటీవల ముంబైలోని అత్యంత ఖరీదైన వర్లీ ఏరియాలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. గత ఏడాది రశ్మిక కెరీర్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. హిందీలో ఆమెనటించిన ‘ఛావా’ భారీ విజయాన్ని సాధించగా, ‘సికందర్’, ‘తమ్మా’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.

తెలుగులో ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా, నటిగా రశ్మికకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మైసా’, హిందీలో ‘కాక్ టెయిల్ 2’ లలో నటిస్తోంది. వీటితో పాటు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప 3’ కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. కేవలం ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్‌లోనూ రశ్మిక ఒక కీలక మలుపు తీసుకోబోతోంది. గత ఏడాది యంగ్ హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్న రశ్మిక, ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, బాధ్యతగల పౌరురాలిగా భారీ స్థాయిలో పన్నులు చెల్లిస్తూ రశ్మిక అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos