బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోన్న ‘రణబాలి’…విరోష్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌ మూవీ

Viswa
2 Min Read
Star couple VijayDevarakonda and Rashmika Mandhanna

Web Stories

Ranabaali Movie: టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన చిత్రాల‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ), హీరోయిన్‌ రష్మిక మందన్న ( Rashmika) జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’ (Ranabaali Movie) . వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ఈ హ్యాట్రిక్ మూవీ వీరిద్దరి కెరీర్‌లోనూ ఓ మైలురాయిగా నిలిచేలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్ర‌తీ షోకు సినిమాకు క‌లెక్ష‌న్స్ పెరుగుతుండ‌ట‌మే ఈ సినిమా స‌క్సెస్‌కు నిద‌ర్శ‌నం. విజయ్ దేవరకొండ నటన, ఆయన ఎంచుకున్న పాత్ర, తెరపై చూపించిన వైవిధ్యం గురించి ప్రేక్షకుల్లో చర్చ కొనసాగు తోంది. ఆయ‌న ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా ‘రణబాలి’ (Ranabaali Cinema) లో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథానాయకుడిగా తన ఇమేజ్‌కు పరిమితం కాకుండా, నటుడిగా కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ర‌ణ‌బాలి చిత్రం మరోసారి స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా పాత్ర కోసం ఆయన చూపించిన డేడికేష‌న్‌, తెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

ప్రస్తుతం యంగ్ స్టార్స్‌కు భిన్నంగా విజయ్ దేవరకొండ మాత్రం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయడం విశేషం. సాధారణంగా యువ కథానాయకులు చేయడానికి ఆసక్తి చూపని భిన్నమైన పాత్రను ఎంచుకుని, దానిలోకి పర‌కాయ ప్ర‌వేశం చేయ‌టం ఆయ‌న‌కే చెల్లింది. ఈ క్రమంలో ‘రణబాలి’ విజయ్‌లోని నటుడిని మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా నిలుస్తోంది. మరోవైపు రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ జోడీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. వీరిద్దరి కలయికకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, సినిమా చుట్టూ కొనసాగుతున్న చర్చలు ‘రణబాలి’కి అదనపు ఆకర్షణగా మారింది.

VijayDevarakonda And Rashmika Ranabaali Movie

‘రణబాలి’ విషయంలో విజయ్ దేవరకొండ చేసిన ఎక్స్‌పెరిమెంట్‌, ఆయన నటనకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌స్తోంది. దేశ‌భ‌క్తిని పెంపొందించే పాత్ర‌లో ఆయ‌న ఒదిగిన తీరుకి జ‌నం నీరాజ‌నాలు ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌ని సరికొత్త విజయ్‌ను చూస్తున్నామ‌ని జ‌నం జేజేలు కొడుతున్నారు. మొత్తంగా చూస్తే, ‘రణబాలి’ విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో భిన్నమైన ప్రయత్నం. మూస పాత్రలకు దూరంగా వెళ్లి కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలనే ఆయన ప్రయత్నం మ‌రోసారి స‌క్సెస్ అయ్యింది. నటుడిగా తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్ దేవరకొండ, ర‌ష్మిక‌ల‌కు ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచింద‌న‌టంలో సందేహం లేదు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో విరోష్ జంట సందడి చేసింది. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. స్టార్ జంట వేడుకల్లో పాల్గొనడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. పెళ్లి తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని రష్మికకు తాను ముందే చెప్పానని విజయ్ దేవరకొండ.. వివాహానంతరం తనకు ఇదే తొలి బతుకమ్మ పండుగ అని రష్మిక మందన్న ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో విరోష్ అభిమానుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

Please Share
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu