అప్పు తీర్చడానికి దొంగతనం చేస్తే…!

PR
PR
1 Min Read
DongaNaaKoduku Teaser

Web Stories

Donga Naa Koduku Teaser: ‘లిటిల్‌హార్ట్స్‌’ సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్న మౌళి తనూజ్‌ ప్రశాంత్‌ (Mouli Tanuj Prashanth) నెక్ట్స్‌ సినిమా ‘దొంగ నా కొడుకు’ (Donga Naa Koduku Movie). అలీ, రజిత ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సుస్మితాశెట్టి హీరోయిన్‌ (Sushmitha Shetty). శ్రీను కంబాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీమూవీమేకర్స్‌ నిర్మించిన ఈ సినిమా నవంబరు 13న రిలీజ్‌ కానుంది. బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్‌.

Donga Naa Koduku Teaser Launch event
Donga Naa Koduku Teaser Launch event

బెట్టింగ్‌యాప్స్‌లో అప్పులపాలైన ఒక యువకుడు, ఆ అప్పులను తీర్చేందుకు ఓ రాబరీ ప్లాన్‌ చేస్తాడు. మరి..ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథమని మౌళి తెలిపారు. ఈ క్రైమ్‌ కామెడీ సినిమా ఆడియన్స్‌కు నచ్చుతుందని మౌళి చెప్పారు. టైటిల్‌ గురించి కాస్త నెగిటివిటీ విని పిస్తుందని, సినిమా చూస్తే, ఎలా ఎందుకు పెట్టామో తెలుసుందని, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమాను చూడవచ్చని దర్శకుడు శ్రీను చెప్పారు. మౌళి మంచి టైమింగ్‌ ఉన్న నటుడు అని అలీ అన్నారు. ఈ చిత్రానికీ అన్నీ బాగా కుదిరాయని, మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని నిర్మాత వై. రవిశంకర్‌ చెప్పారు. ఈ సినిమా తనకొక కమ్‌బ్యాక్‌మూవీలా ఉంటుందని రజిత ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సింజిత్‌ యెర్రమిల్లి మాట్లాడారు.

Please Share
Share This Article
4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu