మనిషే దేవుడిలా మారితే…!

Kumar NA
1 Min Read
Killer Movie Trailer8

Web Stories

KillR Trailer: ‘దేవుడు జన్మిస్తాడు…తయారు కాడు’, ‘మనిషి కూడా జన్మిస్తాడు..తయారు కాడు’, ‘ఈ ఎక్స్‌పరమెంట్‌ సక్సెస్‌ అయితే మనిషే దేవుడిలా తయారు అవుతాడు’….ఈ డైలాగ్స్‌ ఉన్నది ‘కిల్లర్‌’ ( KillR Movie) సినిమాలో. పూర్వజ్‌ ఓ ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ‘కిల్లర్‌’. జ్యోతిపూర్వజ్‌ మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేశారు. పూర్వజ్, పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించగా, దర్శక–నిర్మాత హరీష్‌ శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరై, ఈ సినిమా యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

Killer Movie Trailer Event
Killer Movie Trailer Event

న్యూరోలింక్‌ నేపథ్యంతో సాగే ఈ సైన్స్‌ఫిక్షన్‌ సినిమా కథకు ఓ సూపర్‌ఉమెన్‌ బ్యాక్‌డ్రాప్‌ మిళితం చేయడం అనేది ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్‌ చేస్తుందని, ఈ చిత్రం విజయం సాధించాలని హరీష్‌శంకర్‌ అన్నారు. ఈ సినిమా కథలో మూడు కోణాలు ఉన్నాయని, ఇంట్రవెల్‌ మొదలైన ఐదు నిమిషాల్లోపు ట్విస్ట్‌ను ఆడి యన్స్‌ ముందే గ్రహించి వాట్సప్‌ చేస్తే, కోటి రూపాయల నగదును బహుమతిగా ఇస్తామని దర్శక – నిర్మాత పూర్వజ్‌ తెలిపారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu