Hrithik Roshan: మహేశ్‌బాబు వారణాసి (Varanasi Movie) సినిమాపై ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రుద్రగా, రాముడిగా మహేశ్‌బాబు నటిస్తు న్నారు.మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్‌సుకుమారన్, శివభక్తుడిగా ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ నటించే అవకాశం ఉంది. కానీ సడన్‌గా బాలీవుడ్ స్టార్ హృతిక్‌రోషన్ (Hrithik Roshan) పేరు తెరపైకి వచ్చింది.
కథ రిత్యా..హీరో విభిన్నమైన కాలాల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే త్రేతాయుగంలో రాముడిగా, ప్రజెంట్ టైమ్‌లో బౌంటీ హంటర్‌గా రుద్రగా మహేశ్‌బాబు నటిస్తున్నారు. అయితే ఈ సిని మాలోని శివుడు క్యారెక్టర్‌లో హృతిక్‌రోషన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది.
ఓ దశలో ‘వారణాసి’లోనే..రాముడు, రుద్ర …గెటప్స్‌లో మహేశ్‌బాబు కనిపించినట్లుగానే, ఓ సందర్భంలో శివుడుగానూ మహేశ్‌బాబు కనిపిస్తారనే ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు అలా కాకుండ రాజమౌళి డిఫ రెంట్‌గా ప్లాన్ చేస్తున్నారట. హృతిక్‌రోషన్ అయితే బాగుంటుందని ఆయన అనుకుంటున్నారట. మరి. .‘వారణాసి’ సినిమాలో హృతిక్‌రోషన్ భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
మరోవైపు హృతిక్‌రోషన్ ప్రజెంట్ ఖాళీగానే ఉన్నారు. ఆయన గత చిత్రం ‘వార్ 2’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. బడ్జెట్ ఇష్యూస్ కారణంగా, ‘క్రిష్ 4’ సినిమా ఇప్పట్లో మొదలయ్యే, చాన్స్ లేదు. హోంబలే ఫిల్మ్స్‌లో హృతిక్‌రోషన్, ఓ సినిమాకు కమిటైయ్యాడు. కానీ ఇంకా ఈ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. ఇంకా సమయం పట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి…ఈ గ్యాప్‌లో హృతిక్‌రోషన్ ఏమైనా… ‘వారణాసి’ లో నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ‘వారణాసి’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.
«Чем раньше начнётся профессиональная детоксикация, тем выше шанс избежать необратимых последствий и тяжёлых осложнений», — отмечает врач-нарколог клиники «Азимут Здоровья» Елена Степанова.
Получить больше информации – http://narkolog-na-dom-ramenskoe4.ru/