G2 Movie Release: అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘జీ2’ (G2 Movie Release). అడివి శేష్ కెరీర్‌లోని సూపర్‌హిట్ సినిమా ‘గూఢ చారి’ (2018)కి ఈ సినిమా సీక్వెల్. 2018లో విడుదలైన ‘గూఢచారి’ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ అంటే ‘జీ2’ను ప్రకటించారు మేకర్స్. అయితే ‘గూఢచారి’ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా, ‘జీ2’కి మాత్రం వినయ్‌కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వినయ్ కుమార్‌కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న (Adivi Sesh G2 Movie Release date) ఈ సినిమాను రిలీజ్ చేయ నున్నారు. అడివి శేష్ నుంచి ఇటీవల విడుదలైన ‘డకాయిట్’ సినిమా కమర్షియల్ ఫ్లాప్ కావడంతో, అడివి శేష్ అశలన్నీ ఈ ‘జీ 2’ సినిమాపైనే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో వామికా గబ్బి, మధు శాలిని, సుప్రియా యార్లగడ్డ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిజానికి, ఈ ‘జీ 2’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే అడివి శేష్ చెప్పారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. డిసెంబరు, జనవరి…నెలల్లో భారీ సినిమాలు, వరుస సినిమాలు ఉండటంతో, ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన ‘జీ 2’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి రిలీజ్‌కు సిద్ధమైంది.