Krrish4 Director Hrithick Roshan: హృతిక్‌రోషన్‌ డైరెక్షన్‌లో క్రిష్‌4

Krrish4 Director Hrithick Roshan: హృతిక్‌రోషన్‌ డైరెక్షన్‌లో క్రిష్‌4 . తెరకెక్కనుంది. ఆయనకు దర్శకుడిగా ఇదే తొలి మూవీ. 2026లో క్రిష్‌ 4 మూవీ సెట్స్‌కు వెళ్లొచ్చు.

Viswa
2 Min Read
Krrish4 Director Hrithick Roshan

Web Stories

హృతిక్‌రోషన్‌ దర్శకత్వంలో సూపర్‌హీరో ఫిల్మ్‌ బాలీవుడ్‌ సూపర్‌హీరో ఫ్రాంచైజీలో ఒకటి ‘క్రిష్‌’. ఈ ఫ్రాంచైజీ నుంచి చివరిగా పుష్కరకాలం క్రితం అంటే.. పన్నెండు సంవత్సరాల క్రితం ‘క్రిష్‌ 3’ సినిమా వచ్చింది. ‘క్రిష్‌’ ఫ్రాంచైజీలోని ప్రతి సినిమాలోనూ హృతిక్‌ రోషన్‌ హీరోగా యాక్ట్‌ చేశారు. హృతిక్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌ డైరెక్ట్‌ చేశారు.

‘క్రిష్‌ 3’ చిత్రం 2013 నవంబరు1 న రిలీజైంది. కమర్షియల్‌ హిట్‌ మూవీగా నిలిచింది. నాలుగైదు సంవత్సరాల తర్వాత ఈ ఫ్రాంచైజీని కొనసాగించేందుకు ‘క్రిష్‌ 4’ సినిమాను పరోక్షంగా ప్రకటించారు హృతిక్‌రోషన్‌. కాస్త ఆశ్చర్యకరంగా అనిపించిన ‘క్రిష్‌ 4’ (Krrish4) సినిమా 2023లో రిలీజ్‌ అయ్యేలా అప్పట్లో ప్రణాళికలు సిద్ధమైయ్యాయి. కానీ రాకేష్‌ రోషన్‌ అనారోగ్య కారణాల వల్ల ఈ మూవీ సెట్స్‌కు వెళ్లలేదు.

ఆ నెక్ట్స్‌ హృతిక్‌రోషన్‌తో ‘వార్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తీసిన సిద్దార్థ్‌ ఆనంద్‌ ‘క్రిష్‌ 4’కు దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగింది. కానీ…ఈ మూవీలో హృతిక్‌రోషన్‌యే హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్నట్లుగా మార్చి 28న అధికారిక ప్రకటన వెల్లడైంది (Krrish4 Director Hrithick Roshan). కాగా హృతిక్‌రోషన్‌ ఇప్పటివరకూ దర్శకత్వం వహించిది లేదు. ఇంత పెద్ద భారీ బడ్జెట్‌ సినిమాను, అదీ తొలి దర్శకత్వంలోనే ఎలా హ్యాండిల్‌ చేయబోతున్నారన్న ఆసక్తి బాలీవుడ్‌లో నెలకొని ఉంది.

ప్రస్తుతం ‘వార్‌ 2’ (War 2) తో బిజీగా ఉన్నారు హృతిక్‌రోషన్‌. అయాన్‌ ముఖర్జీ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌ మరో హీరో. ఆగస్టులో ‘వార్‌ 2’ రిలీజ్‌ అవుతుంది. ఈ మూవీ తర్వాత కొంత ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను పూర్తి చేసి, 2026లో ‘క్రిష్‌ 4’  (Krrish4 Release) సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లాలని హృతిక్‌రోషన్‌ భావిస్తున్నారట. ఈ భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌ను రాకేష్‌ రోషన్, ఆదిత్యా చోప్రాలు కలిసి నిర్మించనున్నారు. ఇక…హృతిక్‌రోషన్‌ తాజా చిత్రం ‘వార్‌ 2’కు ఆదిత్యా చోప్రాయే ప్రొడ్యూసర్‌ అన్న విషయం తెలిసిందే.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos