రియాలిటీలోనే ఉన్నారా?

Viswa
1 Min Read

Web Stories

Kiran Abbavaram’s Reality movie: కిరణ్‌ అబ్బవరం (Hero Kiranabbavaram) హీరోగా చేస్తూ, తొలిసారిగా తన కథ, స్క్రీన్‌ ప్లేతోనే స్వీయ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ‘రియాలిటీ’ (Reality movie)  అనే పెట్టుకున్నారు. ఇందులో మధ్యతరగతి యువకుడు ఆనందం అనే పాత్రలో నటిస్తున్నారు కిరణ్‌ అబ్బవరం. సోమవారం ‘రియాలిటీ’ సినిమా (Reality Cinema) టైటిల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసి, రిలీజ్‌డేట్‌ను ప్రకటించారు.

ఇంతవరకు ఒకే కానీ..‘రియాలిటీ’ సినిమాను క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 25న  (Reality movie Release date) రిలీజ్‌ చేయనున్నట్లు కిరణ్‌ అబ్బవరం ప్రకటించారు. కానీ డిసెంబరు 24న బాలకృష్ణ ‘దాదా’, నాగార్జున ‘కింగ్‌ 100’ సినిమాలు రిలీజ్‌కు సిద్ధమైన తరుణంలో తన రియాలిటీ సినిమాను డిసెంబరు 25కి షెడ్యూల్‌ చేయడం అనేది ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. రిలీజ్‌ పరంగా.. అసలు కిరణ్‌ అబ్బవరం ‘రియాలిటీ’లోనే ఉన్నారా? అని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలతో కిరణ్‌ పోటీ పడటం అనేది ‘రియాలిటీ’ రిలీజ్‌ తర్వాత కిరణ్‌కు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుస్తుంది.

జాయ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై సుధాకర్‌ చాగంటి నిర్మాతగా, సురేష్‌ యెర్ర సహ–నిర్మాతగా ఈ సినిమాకు డబ్బులు ఖర్చుపెట్టారు. సాయికుమార్, శరత్‌కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో దేవికా భట్‌ హీరోయిన్‌గా చేశారు.

‘‘పుట్టినప్ప ట్నుంచి చనిపోయేలోపు ప్రతోడిలైఫ్‌లో ఒక హై మూమెంట్‌ ఉంటుంది మావా..నా లైఫ్‌లో హై మూమెంట్‌ ఈ రోజు’,
‘ఈ రోజుటితో నాకు కానీ, నా కుటుంబానికి కానీ ఒక్క రూపాయి కూడా అప్పులేదు మావా.. ..నాలోంటిడికి ఇంతకు మించిన హై మూ మెంట్‌ ఏమి ఉంటుంది చెప్పు…’ అన్న డైలాగ్స్‌
‘రియాలిటీ’ గ్లింప్స్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu