ముత్తువేల్‌ మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందా?

Viswa
1 Min Read

Web Stories

 Rajinikanth JAILER 2 Movie Telugu trailer: రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తీసిన ‘జైలర్‌’ సినిమా 2023లో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ ‘జైలర్‌ 2’ను ప్రకటించారు. రెండున్నరేళ్ల చిత్రీకరణ తర్వాత ‘జైలర్‌ 2’ రిలీజ్‌కు సిద్ధమైంది. ‘జైలర్‌ 2’ మూవీ అక్టోబరు 15న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

రియాలిటీలోనే ఉన్నారా?

వర్మని చంపిన టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌ (సినిమాలో రజనీకాంత్‌ పాత్ర పేరు), వర్మను కమాండ్‌ చేసే ఇంకా పెద్ద రౌడీలు ఎవరు ఉన్నారా? అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ‘కల్పాస్‌ గ్యాంగ్‌’ (విలువైన విగ్రహాల అక్రమ రవాణా చేసే సిండికేట్‌ మాఫియా) గ్యాంగ్‌ లీడర్‌ పనిపట్టేందుకు కేరళలో ఓ సాధారణ కారు డ్రైవర్‌గా జాయిన్‌ అవుతాడు. ఇలా కారు డ్రైవర్‌గా ఉంటూనే ఓ సీక్రెట్‌ ఆపరేషన్‌ చేస్తాడు. ఈ ఆప రేషన్‌ ఎలా సక్సెస్‌ అయ్యిందన్నదే ఈ ‘జైలర్‌ 2’ సినిమా కథనం అని, విడుదలైన ‘జైలర్‌ 2’ సినిమా ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది.

‘జైలర్‌ 2’ స్టోరీలైన్‌ అయితే ఓల్డ్‌ ఫార్మాట్‌లోనే ఉంది. మరి..స్క్రీన్‌ ప్లే పరంగా దర్శకుడు నెల్సన్‌ ఏమైనా మాయ చేస్తారా? రజనీ స్టైల్‌ మరోసారి మ్యాజిక్‌ చేస్తుందా? అనేది చూడాలి.

ఇక ఈ సినిమాలో మిథున్‌ చక్రవర్తి, ఎస్‌జేసూర్య, విద్యాబాలన్, సూరజ్‌ వెంజరాముడు, రమ్యకృష్ణ, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించారు.
ఈ ‘జైలర్‌ 2’ సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ రిలీజ్‌ చేస్తుంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu