ఎట్టా..ఎట్టా..ఎట్టా..ఇట్టా ముస్తాబయితే..ఎట్టా…

Viswa
1 Min Read

Web Stories

Yetta Yetta Video Song: ‘ఏజెంట్‌’ వంటి ఫ్లాప్‌ మూవీ తర్వాత, అఖిల్‌ చేస్తున్న లవ్‌స్టోరీ సినిమా ‘లెనిన్‌’ (Lenin Movie). భాగ్యశ్రీభోర్సే హీరోయిన్‌. ఈ సినిమా జూన్‌ 26న (Lenin Movie Release date) రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ‘ఎట్టా..ఎట్టా..’ పాట వీడి యో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. మంచి ఎనర్జిటిక్‌ స్టెప్స్‌తో అఖిల్, భాగ్యశ్రీభోర్సే ఈ పాటలో డ్యాన్స్‌ చేశారు.

లోకల్‌ టచ్‌తో సాగే, ఈ మాస్‌ మెలోడీ సాంగ్‌ను ఈ మూవీ మ్యాజిక్‌ డైరెక్టర్‌ తమన్, సింగర్‌ శ్రీకృష్ణ పాడారు. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారు. మురళీ కిషోర్‌ అబ్బూరి ఈ సినిమాకు దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ తుదిదశకు చేరకుంది.

లెనిన్‌ సినిమా రాయలసీమ నేపథ్యంతో సాగుతుంది. ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ డ్రామా ఇది. యాక్షన్‌తో పాటుగా, బలమైన భావోద్వేగాలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. లెనిన్‌తో హిట్‌ కొట్టి, ఈ సినిమాతోనైనా అఖిల్‌ ఫామ్‌లోకి రావాలని, అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi