మారుతి నెక్స్ట్ మూవీకి క్రేజీ టైటిల్.. హీరో అతనేనా..?

Kumar NA
1 Min Read

Web Stories

Crazy title for director maruti’s next movie : టాలీవుడ్ దర్శకుడు మారుతి ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక సవాల్‌తో కూడిన సమయాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌తో రూపొందించిన ‘రాజా సాబ్’ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడమే కాకుండా, ఆయనపై నెట్టింట భారీగా విమర్శలు వచ్చేలా చేసింది. అయితే, ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న మారుతి, తన బలం ఏంటో నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.

తను కోల్పోయిన ఇమేజ్‌ను తిరిగి సంపాదించుకోవడానికి మారుతి మళ్ళీ తన మార్కు కామెడీ ఎంటర్‌టైనర్‌నే నమ్ముకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పేరుకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ కథకు సరిపోయే హీరో కోసం మారుతి అన్వేషణ మొదలుపెట్టగా, ఆయన దృష్టి వరుణ్ తేజ్ పై పడింది. అయితే ఇక్కడ ఒక చిన్న మలుపు ఉంది. వరుణ్ తేజ్ ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడు యదు వంశీతో ఒక సినిమాకు ఓకే చెప్పారు. దీనిని నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. మారుతి సినిమా పట్టాలెక్కాలంటే వరుణ్ ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్‌లలో పాల్గొనాల్సి ఉంటుంది.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వరుణ్ ఈ రిస్క్ తీసుకుంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మారుతికి అత్యంత ఆప్తుడైన బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉండగా, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తన గత చిత్రం ‘రాజా సాబ్’ సంక్రాంతి సీజన్‌లో నిరాశపరిచినప్పటికీ, అదే సీజన్‌లో ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా చాటాలని మారుతి కసితో పని చేస్తున్నారు. మరి మారుతి అడిగిన వెంటనే వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi