Daaku Maharaaj: దబిడి దిబిడి..డాకు మహారాజ్‌కు డ్యామేజ్‌!

Viswa
2 Min Read

Daaku Maharaaj: బాలకృష్ణ (NBK) తాజా మూవీ ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj) సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్స్‌లో రిలీజ్‌ కా నుంది. బాబీ (కేఎస్‌ రవీంద్ర) సినిమాకు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ నుంచి ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం దబిడి దిబిడి (Dabidi Dibidi Song) అనే పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సాంగ్‌ ఫుల్‌ ట్రోలింగ్‌ అవుతోంది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా బాలకృష్ణ వయసు ఏంటి? హీరోయిన్‌ ఊర్వశీ రౌతెలా వయసు ఏంటి? ఈ స్టెప్స్‌ ఏంటి? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. పైగా శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీతో, ఊర్వశీ రౌతెలా స్పెషల్‌ డ్యాన్స్‌ మెంబర్‌ హీరోయిన్‌గా, బాబీ దర్శకత్వంలోనే వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘వేర్‌ ఈజ్‌ ది పార్టీ’ సాంగ్‌ను కంపేర్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఊర్వశీతో చిరంజీవి వేసిన స్టెప్స్‌ బాగున్నాయని, బాలకృష్ణ వేసిన స్టెప్స్‌ ఇబ్బందికరంగా ఉన్నాయని నెటిజన్ల కంప్లైట్స్‌.

Balakrishna Aditya999: బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మొదలైనట్లేనా..?

సంక్రాంతికి బాలకృష్ణ ‘డాకు మహారజ్‌’, రామ్‌చరణ్‌ ‘గేమ్‌చేంజర్‌’ ట్రైలర్‌లు విడుదల అయ్యాయి. గేమ్‌చేంజర్‌ ట్రైలర్‌కు కాస్త పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ రాగా, బాలకృష్ణ డాకుమహారాజ్‌ ‘దబిడి దిబిడి’ సాంగ్‌కు ట్రోలింగ్‌ ఎదురైంది. పనిలో పనిగా కొందరు చరణ్‌ ఫ్యాన్స్‌ కూడా ‘దబిడి దిబిడి’ సాంగ్‌ స్టెప్స్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ‘డాకు మహారాజ్‌’ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ఫస్ట్‌లుక్స్‌ బాగున్నాయి. కానీ తొలిసారిగా ‘డాకుమహారాజ్‌’కు నెట్టింట నెగిటివిటీ ఎదురవుతోంది. ఇక విడుదల కాబోయే ‘డాకు మహారాజ్‌’ ట్రైలర్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Nandamuri Balakrishna Akhanda2: అఖండ 2 రిలీజ్‌ ఫిక్స్‌..కాంతారతో పోటీ

డాకుమహారాజ్‌ సినిమాలో శ్రద్దాశ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతెలా, ప్రగ్యా జైస్వాల్, బాబీ డియోల్‌ ఇతర లీడ్‌ రోల్స్‌ చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్‌ రోల్‌ చేస్తున్నారు. ఇందులోని ఓ పాత్రలో బాల కృష్ణ బందిపోటు పాత్రలో కనిపిస్తారు.

Share This Article
5 Comments