తమిళంలో హీరో విశాల్ (Vishal) ఎంత పాపులరో, తెలుగులోనూ అంతే పాపులర్. తెలుగు మూలాలు ఉండటంతో విశాల్‌ను తెలుగు ఆడియన్స్ బాగానే ఓన్ చేసుకున్నారు. అయితే విశాల్ ప్రస్తుత విజువల్స్, అందర్నీ షాక్‌కు గురిచేస్తున్నాయి.
విశాల్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘మదగజరాజు’. దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం విశాల్ యాక్ట్ చేసిన ఈ మూవీ, కొన్ని కారణాల వల్ల అప్పట్లో రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఈ సంక్రాంతికి అంటే.. జనవరి 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా వేడుక చెన్నైలో జరగ్గా, విశాల్ హాజరైయ్యాడు.
కానీ విశాల్ సరిగా మాట్లాడలేకపోవడం, కనీసం చేతిలో ఉన్న మైకును సరిగా పట్టుకోలేక ఇబ్బంది పడు తుండటం వంటి సోషల్‌మీడియా విజువల్స్ నెటిజన్లను షాక్‌కు గురి చేశాయి. అసలు..విశాల్ (Vishal) ఆరోగ్యం ఏమైంది? అన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే విశాల్ ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని, ఆయన హై ఫీవర్‌తో బాధపడుతున్నారని, ఈ ఫీవర్ కారణంగానే విశాల్ వేదికపై అనారోగ్యంతో కనిపించారనే వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ విశాల్‌ను ఓ అధికారిక ప్రకటన వస్తే బాగుటుందని, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Honey Rose: ఓ వ్యాపారవేత్త వేధిస్తున్నాడు: హనీరోజ్
మరోవైపు విశాల్ లాస్ట్ మూవీ ‘రత్నం’. గతేడాది విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించ లేదు. దీంతో తన కెరీర్‌లో ఓ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన, ‘డిటెక్టివ్’ సినిమాకు సీక్వెల్‌గా ‘డిటెక్టివ్ 2’ చేయాలను కున్నాడు విశాల్. కొంత ప్రీ ప్రోడక్షన్ వర్క్ కూడా జరిగింది. కానీ ఎందుకో మరో ముందడుగు పడలేదు. అలాగే విశాల్ కెరీర్‌లోని మరో హిట్ ఫిల్మ్ ‘ఇరంబుదరై’కి సీక్వెల్ రానుందనే వార్తలు కూడా వచ్చాయి.
మరి..విశాల్ నెక్ట్స్ మూవీ ఏం అవుతుందో చూడాలి.