హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ మూవీ రూపుదిద్దుకోంటోంది. ఈ సంక్రాంతి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ కానుంది. తొలి షెడ్యూల్‌ను కర్ణాటకలో ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో మలయాళ నటుడు టోవినో థామస్ (Tovino Thomas)ను చిత్రంయూనిట్ ఎంపిక చేస్తున్నారు. ‘2018: ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో, మిన్నల్ మురళి, ఏఆర్‌ఎమ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు టోవినో థామస్ సుపరిచితులే.
మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ భారీ పీరియాడికల్ ఫిల్మ్‌ను తీయ నున్నారు. దాదాపు పదిహేను దేశాల్లో ఈ మూవీ చిత్రీకరణను ప్లాన్ చేశారట మేకర్స్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణీవసంత్, మరో లీడ్ రోల్‌లో మలయాళ నటుడు బీజూ మీనన్ కనిపిస్తారు. రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. 2026 జనవరి 9న ఈ మూవీ రిలీజ్ కానుంది.