‘వారణాసి’ లో నాలుగు పాత్రల్లో మహేష్ బాబు.. ఏం ప్లాన్ చేసావ్ జక్కన్న?

Kumar NA
2 Min Read

Web Stories

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ పై రోజుకో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు పోషించబోయే పాత్రల గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. రాజమౌళి సినిమాల్లో హీరోల ఎలివేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే, ఈసారి మహేష్ బాబు కోసం ఆయన ఒక అద్భుతమైన విజువల్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ కేవలం అడ్వెంచరర్ గానే కాకుండా, పౌరాణిక నేపథ్యం ఉన్న పలు కీలక రూపాల్లో కనిపించనున్నారని టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో మహేష్ బాబు ఏకంగా మూడు భిన్నమైన పౌరాణిక పాత్రల ఛాయల్లో కనిపిస్తారట. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర.. త్రిమూర్తుల గెటప్స్‌లో మహేష్ బాబు కనిపించబోతున్నారని సమాచారం. వీటితో పాటు అత్యంత కీలకమైన సన్నివేశాల్లో ఆయన శ్రీరాముడి అవతారంలోనూ అలరించనున్నారట. ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అయినప్పటికీ, కథలో మన భారతీయ ఇతిహాసాలకు, పౌరాణిక అంశాలకు బలమైన లింక్ ఉంటుందని సమాచారం. హీరో చేసే ప్రయాణంలో భాగంగా లేదా కొన్ని ప్రత్యేకమైన ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌లలో ఈ ‘త్రిమూర్తుల’ పాత్రలతో పాటూ ‘రాముడి’ రూపాలు కనిపిస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఇదే నిజమైతే, మహేష్ బాబు లాంటి అందగాడిని త్రిమూర్తుల రూపంలో చూడటం అభిమానులకు కన్నుల పండగే అని చెప్పాలి. రాజమౌళి విజన్, ఎం.ఎం. కీరవాణి సంగీతం తోడైతే ఈ సన్నివేశాలు వెండితెరపై ఒక అద్భుత కావ్యంలా నిలిచిపోతాయి. ప్రస్తుతం ఈ వార్త అధికారికం కాకపోయినప్పటికీ, మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా మహేష్ ఇలాంటి వైవిధ్యమైన లుక్స్‌లో కనిపిస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం. 2027 ఏప్రిల్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please Share
Share This Article
10 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi