నాగచైతన్య (Nagachaitanya) కెరీర్‌లోనే హాస్టెస్ట్ బడ్జెట్‌తో ‘తండేల్’ (Thandel Release) మూవీ రూపొందింది. దాదాపు తొంభై కోట్ల రూపాయాల బడ్జెట్‌తో ‘తండేల్’ సినిమాను తీశారు ఈ చిత్రం నిర్మాత బన్నీవాసు. ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
ఇంతవరకు బాగానే ఉంది…కానీ సడన్‌గా …ఫిబ్రవరి 6న అజిత్ ‘పట్టుదల’ (తమిళంలో ‘విడాముయర్చి’) మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఫ్యామి లీతో కలిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్తాడు ఓ వ్యక్తి. అక్కడ తన భార్య, కుమార్తె మిస్ అవుతారు. వారిని ఆ వ్యక్తి ఎలా కనిపెట్టాడు? ఫ్యామిలీని ఎలా రక్షించుకున్నాడు? అనేది ‘పట్టుదల’ సినిమా కథనంగా కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.
సేమ్ ..‘తండేల్’ స్టోరీ కూడా ఇదే. ఉత్తరాంధ్ర నుంచి గుజరాత్‌కు వలస వెళ్లిన ఓ మత్స్యకారుడు అక్కడ పాకిస్తాన్ కోస్టు గార్డులకు బందీగా చిక్కుతాడు. తిరిగి తన భార్యను ఎలా కలుసుకున్నాడు? అన్నదే ‘తండేల్’ సినిమా కథనమని, ఆల్రెడీ వార్తలు వచ్చాయి. దగ్గరిగా గమనిస్తే…‘పట్టుదల, తండేల్’ సినిమాల కోర్ పాయింట్..భార్యభర్తల మధ్య ఏడబాటు. తండేల్‌లో నాగచైతన్య, సాయిపల్లవిలు జంటగా నటిస్తే… పట్టుదలలో అజిత్, త్రిషలు జోడీగా చేశారు.
AjithKumar: తృటిలో తప్పించుకున్న అజిత్
పట్టుదల (Pattudhala) మూవీ ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి..ఈ సినిమాలోని ఎమోషన్‌కు ఆడియన్స్ కనెక్ట్ అయితే..‘తండేల్’కి బాక్సాఫీస్ తిప్పలు తప్పవు. అయితే ‘తండేల్’ మూవీని లవ్‌స్టోరీగా చెబుతున్నారు. అలా అనుకున్న కూడా..ఫిబ్రవరి 7న తండేల్ విడుదలైతే, ఫిబ్రవరి 14న విశ్వక్‌సేన్ ‘లైలా’, కిరణ్ అబ్బ వరం ‘దిల్ రూబా’ వంటి లవ్‌స్టోరీ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏసినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా …‘తండేల్’ మూవీ కలెక్షన్స్‌కు దెబ్బ పడినట్లే. ఇలా ‘తండేల్’ మూవీరిలీజ్ డేట్, స్టోరీ లైన్, బడ్జెట్.. వంటివి..గమనిస్తున్నప్పుడు…ఫి
Sundeep Kishan Mazaka: సందీప్‌కిషన్ కొంపముంచిన అజిత్
అయితే ‘తండేల్’ నుంచి ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ బాగానే ఉంది.‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరవాత సాయిపల్లవి (Saipallavi) హీరోయిన్‌గా చేసిన మూవీ ‘తండేల్’.సో..ఈ పరంగా ‘తండేల్’ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే హిట్ కావొచ్చు. గతంలో నాగచైతన్య, సాయిపల్లవిలు జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ మూవీ కూడా విజయం సాధించింది. కానీ రిస్క్ జోన్ మాత్రం ఉన్నట్లే. చందూ మెండేటి తండేల్ సినిమాకు దర్శకుడు.
Akkineni Naga Chaitanya: రెండు హారర్ మూవీలకు సైన్ చేసిన నాగచైతన్య