ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధినేత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ‘దిల్’ రాజు (Producer DIl Raju) ఆఫీసు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ‘దిల్’ రాజు కార్యాలయం, ఇళ్లతో పాటుగా, ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితా రెడ్డి (దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్వాహకురాలు) ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ ఎఫెక్ట్?
2025 సంక్రాంతికి విడుదలైన, రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రూ. 200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే ఈ సంక్రాంతికి విడుదలైన మరో చిత్రం బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూవీ రూ. 150 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లుగా మేకర్స్‌పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘దిల్’ రాజు పంపిణీదారుడు. ఇలా..సంక్రాంతికి రిలీజైన ‘గేమ్‌చేంజర్,
సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్’ సినిమాలకు అసోసియేట్ అయిఉన్నారు ‘దిల్’ రాజు.
Venkatesh: ఆల్‌టైమ్ సంక్రాంతి రికార్డు సాధ్యమేనా?
పుష్ప ది రూల్ ఎఫెక్ట్?
అలాగే టాలీవుడ్‌లో మరో ప్రముఖ నిర్మాణసంస్థ అయిన మైత్రీమూవీమేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్‌లపై కూడా ఐటీ దాడులు జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. అలాగే మైత్రీ సీఈవో చెర్రీకి చెందిన వారిలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయట. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ‘పుష్ప ది రూల్’ మూవీకి ఇప్పటికే రూ. 1700 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా మేకర్స్ ప్రకటించారు.
Pushpa2Collections: ఇక దంగల్ జెండా దించుడే బ్యాలెన్స్…!

అలాగే మైత్రీమూవీమేకర్స్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు ప్రభాస్ ‘ఫౌజి’, సన్నీడియోల్ ‘జాట్’, రిషబ్‌శెట్టి ‘జైహనుమాన్’, రామ్‌చరణ్ ‘పెద్ది’ (నిర్మాణ భాగస్వామ్యం), అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇక గతంలోనూ ఓ సందర్భంగా మైత్రీమూవీమేకర్స్ సంస్థ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఇటీవల ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకు ఫైనాన్షియర్‌గా ఉన్న సత్యరంగయ్య, దర్శక-నిర్మాత అభిషేక్ అగర్వాల్, వెంకట సతీష్ కిలారుల కార్యాల యాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లుగా ఫిల్మ్‌నగర్ నుంచి సమాచారం అందుతోంది.