తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (ReturnOfTheDragon Movie) అంటే తెలుగు ఆడియన్స్‌కు అంతగా తెలియకపోవచ్చు. కానీ ప్రదీప్ రంగనాథన్ అసోసియేట్ అయిన ‘కోమలి, లవ్‌టుడే’ సినిమాలు మాత్రం తెలుగు ఆడియన్స్‌కు బాగా తెలుసు. రవి మోహన్ (‘జయం’ రవి) హీరోగా చేసిన ‘కోమలి’ మూవీకి డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. 2019లో విడుదలైన ఈ మూవీ ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ తర్వాత ప్రదీప్ రంగనాథన్‌యే డైరెక్టర్ కమ్ హీరోగా ‘లవ్‌టుడే’ సినిమా చేశాడు. సేమ్ టైటిల్‌తో వచ్చిన ఈ యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
యూత్ పల్స్‌ను బాగా పట్టుకున్న ప్రదీప్‌రంగనాథన్ ప్రస్తుతం తమిళంలో ‘డ్రాగన్’ (ReturnOfTheDragon Movie) అనే మూవీ చేశాడు. అనుపమాపరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్స్‌గా చేశారు. యూత్‌పుల్ మూవీస్ తీసే తమిళ దర్శకుడు అశ్వత్‌మారిముత్తు ఈ సినిమాకు డైరెక్టర్. ‘లవ్‌టుడే’ని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ఈ మూవీని నిర్మించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 21న రిలీజ్ కానుంది. తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
యూత్‌ఫుల్ మూవీగా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఓ స్టూడెంట్ లైఫ్‌స్టోరీగా ఈ మూవీ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. నిన్ను లవర్‌గానే చూడొచ్చు…లైఫ్‌పార్టనర్‌గా కాదు!, వాడే మా ప్రాణం…వంటి డైలాగ్స్ ఉన్నాయి. ఓ స్టూడెంట్‌గా ఫెయిల్ అయిన ఓ వ్యక్తి, ఇంట్లో అమ్మానాన్నలను, లవర్‌ను మోసం చేస్తుం టాడు. నిజం తెలిసినప్పుడు అతని జీవితం ఏమైంది? అన్నదే ఈ సినిమా కథనంగా తెలుస్తోంది. ఓ రకంగా ఒకప్పుడు శింబు యాక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘వల్లభ’ గుర్తొస్తోంది.
డ్రాగన్ సినిమాను తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. హీరో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లోని మూవీకి తెలుగులో ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. అందుకే ప్రదీప్ రంగనాథన్ మూవీని ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీని నిర్మిస్తున్న మైత్రీమూవీమేకర్స్‌యే, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీనిని ఫిబ్రవరి 14న రిలీజ్‌కు ప్లాన్ చేశారు. కానీ అజిత్ పట్టుదల మూవీ ఏప్రిల్ 7న రిలీజ్‌కు సిద్ధమైనప్పుడు, ఈ సినిమాకు స్మూత్ సక్సెస్‌ఫుల్ రన్ ఉండాలని, ఈ నెల 21కి వాయిదా వేశారు. కానీ పట్టుదల మూవీ సరిగా ఆడని విషయం తెలిసిందే.