Rashmika Mandanna Chhaava: రష్మికా మందన్నా డెడికేషన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే

Viswa
2 Min Read

Web Stories

హీరోయిన్‌ రష్మికా మందన్నా (Rashmika Mandanna Chhaava)  డేడికేషన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.  కుంటుకుంటు రష్మికా మందన్నా హిందీ చిత్రం ‘ఛావా’ ప్రమోషన్స్‌లో పాల్గొనడం అందర్నీ ఆకర్షించింది.

Rashmika Mandanna 10

 

ఇటీవల జిమ్‌లో రష్మికామందన్నా (RashmikaMandanna)  కసరత్తులు చేస్తుండగా, ఆమె కాలికిగాయమైంది. దీంతో ఇంటికే పరిమితమైయ్యారు రష్మికా మందన్నా. ముంబై లో గాయపడిన రష్మిక, అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకుని, హైదరాబాద్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నారు. అయితే ఆమె హీరోయిన్‌గా చేసిన హిందీ చిత్రం ‘ఛావా’ ఫిబ్రవరి 14న రిలీజ్‌ కానుంది. విక్కీ కౌశల్‌ హీరోగా చేసిన ఈ మూవీకి లక్మణ్‌ ఉటేకర్‌ డైరెక్టర్‌గా చేశాడు. దినేష్‌ విజన్‌ నిర్మించాడు.

RashmikaMandanna Movies: మహారాణి ఏసుబాయి…ఈ ఏడాది ఐదు సినిమాల రిలీజ్‌లు

బుధవారం ‘ఛావా’ (Chhaavaa) సినిమా ట్రైలర్‌ లాంచ్‌ వేడుక ముంబైలో జరిగింది. ఈ వేడుక కోసం గాయపడ్డ కాలితోనే రష్మికామందన్నా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రావడం, అక్కడి సిబ్బంది ఆమెను వీల్‌చైర్‌లో తీసుకువెళ్లడం వంటి వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇక ముంబై చేరుకున్నాకా, రష్మికా మందన్నా కుటుకుంటూనే ‘ఛావా’ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొని, ఉత్సాహంగా మాట్లాడారు. ‘ఛావా’ సినిమా తనకెంతో స్పెషల్‌ అని, అందుకే తనకు గాయమైన ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి వచ్చానని రష్మికా మందన్నా చెబుతున్నారు. అయితే వర్క్‌ పట్ల రష్మికా మందన్నాకు ఉన్న అంకితభావం చూసి, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఆమె అభిమానులైతే హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.

ఇక విక్కీ కౌశల్‌ యాక్ట్‌ చేసిన ‘ఛావా’ ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. విజువల్‌గా కూడా అద్భుతంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ తన యుడు శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా ‘ఛావా’ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రంలో శంభాజీగా విక్కీ కౌశల్‌, శంభాజీ భార్య ఏసుభాయిగా రష్మికా మందన్నా, ఔరంగజేబుగా అక్షయ్‌ఖన్నా ఇతర లీడ్‌ రోల్స్‌ చేశారు. ఇప్పటివరకు రిలీజ్‌ చేసిన ‘ఛావా’ కంటెంట్‌ అయితే ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. మరి..మూవీకి ఎలాంటి రిజల్ట్‌ వస్తుందో చూడాలి.

 

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu